DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
DA Arrears | ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లకు సర్కారు సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏల్లో (DA Arrears) రెండు డీఏలను ఒకేసారి ఇచ్చేందుకు సమ్మతించింది.
DA Arrears | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లకు సర్కారు సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏల్లో (DA Arrears) రెండు డీఏలను ఒకేసారి ఇచ్చేందుకు సమ్మతించింది. దరసరాకు రెండు డీఏలను విడుదల చేసేందుకు ఓకే చెప్పింది. ఇక పీఆర్సీ (PRC) నివేదికను పది రోజుల్లో తీసుకుంటామని ఉద్యోగులకు హామీ ఇచ్చింది. అదేవిధంగా సీపీఎస్‌పై (CPS) కమిటీ ఏర్పాటు చేసింది. పెండింగ్ బిల్లుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju) ఉద్యోగ సంఘాలకు (TGEJAC) హామీ ఇచ్చారు.
ప్రభుత్వ సూచన మేరకు రెండు రోజులుగా వాయిదా పడిన ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సచివాలయంలో జరిగింది. ఐదు డీఏల్లో కనీసం మూడు ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అయితే రెండు డీఏలు ఇవ్వాలని కేబినెట్‌కు సిఫార్సు చేస్తామని సీఎస్ సంజయ్ జాజు తెలిపారు. దసరా నాటికి ఒకటి, ఉగాది వరకు మరో డీఏ ఇచ్చేలా ప్రతిపాదిస్తామని సీఎస్ చెప్పారు. సీఎస్ ప్రతిపాదనకు ఉద్యోగులు ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫమయ్యాయి. మరోసారి ఉపముఖ్యమంత్రి (Bhatti Vikramarka) సమక్షంలో ఉద్యోగ సంఘం నేతలతో సీఎస్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు డీఏలను దసరాకు ఒకేసారి చెల్లించేందుకు ఒప్పుకున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
- ●Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం

Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా






