త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Inter Results | ఇంట‌ర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేది కేశ‌వ రావు

TG Inter Results | తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు ఈ నెల 12న విడుద‌ల కానున్నాయి. నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్యాల‌యంలో ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కే కేశ‌వ‌రావు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు అధికారులు అధికారికంగా ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Apr 11, 2026, 7.10 pm IST

TG Inter Results | ఇంట‌ర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేది కేశ‌వ రావు
Advertisement

TG Inter Results | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు ఈ నెల 12న విడుద‌ల కానున్నాయి. నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్యాల‌యంలో ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కే కేశ‌వ‌రావు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు అధికారులు అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇంట‌ర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తార‌ని అంద‌రూ భావించారు. కానీ చివ‌ర‌కు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేకే ఇంట‌ర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తార‌ని ప్ర‌క‌టించారు.

ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌కు 9,97,075 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఇందులో ఫ‌స్టియ‌ర్ విద్యార్థులు 4,89,126 మంది కాగా, సెకండియ‌ర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. ఫ‌స్టియ‌ర్ విద్యార్థుల్లో 2.17 ల‌క్ష‌ల మంది బాలురు, 2.24 ల‌క్ష‌ల మంది బాలిక‌లు ఉన్నారు. ఒకేష‌న‌ల్ కోర్సుల‌కు సంబంధించి 22,586 మంది బాలురు, 24,675 మంది బాలిక‌లు ఉన్నారు. ద్వితీయ సంవ‌త్సరం విద్యార్థుల్లో 2.31 ల‌క్ష‌ల మంది బాలురు, 2.30 ల‌క్ష‌ల మంది బాలిక‌లు ఉన్నారు. ఫిబ్ర‌వ‌రి 25 నుంచి మార్చి 18వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 1495 కేంద్రాల్లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు.

వాట్సాప్‌లో ఇంట‌ర్ ఫ‌లితాలు.. డౌన్‌లోడ్ ఇలా..

  • 80969 58096ను మీ కాంటాక్ట్‌లో "Mee Seva Telangana"గా సేవ్ చేయాలి.
  • వాట్సాప్‌ తెరిచి "Hi" అని పంపగానే మీసేవ చాట్‌బాట్ మొదలవుతుంది.
  • "BIE Exam Result" టైప్ చేసి Open Service నొక్కాలి.
  • మీ రూల్ నంబర్ నమోదు చేసి సంవత్సరం (1వ / 2వ), స్ట్రీమ్ (జనరల్/వొకేషనల్) ఎంచుకొని స‌బ్‌మిట్ చేయ‌గానే ఫలితం తక్షణమే వాట్సాప్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది.

Advertisement
Advertisement