త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Excise Commissioner | ఎక్సైజ్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి.. ఉద్యోగుల జేఏసీ డిమాండ్

Excise Commissioner | ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని అకారణంగా దూషించి ఆయనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసి గుండెపోటు వచ్చేలా ప్రవర్తించిన ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది.

S

Telangana | Published On Apr 11, 2026, 4.23 pm IST

Excise Commissioner | ఎక్సైజ్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి.. ఉద్యోగుల జేఏసీ డిమాండ్
Advertisement

ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలి

Excise Commissioner | త్రినేత్ర.న్యూస్ : ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని అకారణంగా దూషించి ఆయనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసి గుండెపోటు వచ్చేలా ప్రవర్తించిన ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రెటరీ ఓడనాల రాజశేఖర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఉద్యోగుల‌ను దూషిస్తూ, అవ‌మాన‌ప‌రుస్తున్న ఆబ్కారీ శాఖ క‌మిష‌న‌ర్ వ్య‌వ‌హారంపై ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసి విచార‌ణ జ‌రపాలని డిమాండ్ చేశారు. అన్ పార్ల‌మెంట‌రీ భాష‌తో, ప‌రుష ప‌ద‌జాలంతో ఉద్యోగుల‌ను దూషిస్తూ, వారి జీవితాల‌తో ఆడుకుంటున్న ఆబ్కారీ క‌మిష‌న‌ర్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. 30 ఏళ్లు ఆబ్కారీ శాఖ‌కు సేవ‌లందించిన ఉత్త‌మ అధికారి నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డిని అదే శాఖ క‌మిష‌న‌ర్ అకార‌ణంగా దూషించ‌డాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.

Advertisement
Advertisement