త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Devi Prasad | చ‌ర్చ‌లు కాదు.. పీఆర్సీ నివేదిక కావాలి : దేవీ ప్ర‌సాద్

Devi Prasad | అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత దేవీ ప్ర‌సాద్ మండిప‌డ్డారు. బుధ‌వారం సీఎస్ సంజ‌య్ జాజుతో జ‌రిపిన చ‌ర్చ‌ల్లో పెండింగ్‌లో ఉన్న డీఏల‌తో పాటు పీఆర్సీ ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Sep 23, 2026, 7.02 pm IST

Devi Prasad | చ‌ర్చ‌లు కాదు.. పీఆర్సీ నివేదిక కావాలి : దేవీ ప్ర‌సాద్
Advertisement

Devi Prasad | త్రినేత్ర న్యూస్ : అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత దేవీ ప్ర‌సాద్ మండిప‌డ్డారు. బుధ‌వారం సీఎస్ సంజ‌య్ జాజుతో జ‌రిపిన చ‌ర్చ‌ల్లో పెండింగ్‌లో ఉన్న డీఏల‌తో పాటు పీఆర్సీ ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చ‌ర్చ‌ల పేరుతో కాల‌యాప‌న చేస్తున్నార‌ని నిప్పులు చెరిగారు.

పీఆర్సీ గడువు పూర్తయినా నివేదికపై స్పష్టత లేకపోవడం ఉద్యోగులు ఆందోళ‌న చెందుతున్నారు. పీఆర్సీ నివేదికను తక్షణమే తెప్పించి, దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. “చర్చలు కాదు.. నివేదిక కావాలి, నిర్ణయం కావాలి, అమలు కావాలి” అని ఆయన అన్నారు. పీఆర్సీ నివేదికను అందించాల్సిందిగా అధికారుల కమిటీని ఆదేశించామని, నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2026 మేలో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఇప్ప‌టికీ నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో ఉద్యోగ సంఘాలకు అన్యాయం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా మరోసారి అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాకుండా మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని దేవీప్రసాద్ అన్నారు. ఉద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాన్ని పదేపదే కమిటీలకు అప్పగించడం సరికాదన్నారు.

ఉద్యోగులకు రావాల్సిన డీఏలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను పూర్తిగా పరిష్కరించకుండా విడతల వారీగా కొన్ని డీఏలు మాత్రమే ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు పూర్తి న్యాయం జరిగినట్లు చెప్పడం సమంజసం కాదన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్‌ సాలరీ, కమ్యుటేషన్, జీపీఎఫ్, గ్రూప్‌ ఇన్సూరెన్స్ తదితర బకాయిలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement