త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Discoms | చరిత్ర సృష్టించిన తెలంగాణ విద్యుత్ శాఖ.. విద్యుత్ వినియోగంలో ఆల్‌ టైమ్ రికార్డ్

Telangana Discoms | తెలంగాణ విద్యుత్ సంస్థలు చరిత్ర సృష్టించాయి. ఒకే రోజు అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్లు (MU) విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టించింది. 2026 మార్చి 13న ఉదయం 11:17 గంటలకు 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను తట్టుకుని విజయవంతంగా సరఫరా చేసింది.

S

Telangana | Published On Mar 14, 2026, 6.27 pm IST

Telangana Discoms | చరిత్ర సృష్టించిన తెలంగాణ విద్యుత్ శాఖ.. విద్యుత్ వినియోగంలో ఆల్‌ టైమ్ రికార్డ్
Advertisement

13న ఒక్క రోజే ​ 341 మిలియన్ యూనిట్ల సరఫరా
భవిష్యత్ అవసరాలకు సిద్దంగా ఉన్నాం
విద్యుత్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ విద్యుత్ సంస్థలు చరిత్ర సృష్టించాయి. ఒకే రోజు అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్లు (MU) విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టించింది. 2026 మార్చి 13న ఉదయం 11:17 గంటలకు 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను తట్టుకుని విజయవంతంగా సరఫరా చేసింది.

2026 మార్చి 13న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. ఆ రోజున రాష్ట్రం 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి, గత రికార్డు 335.19 మిలియన్ యూనిట్లు (18.03.2025) ను అధిగమించింది. అదే విధంగా, 18,228 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను కూడా విజయవంతంగా తీర్చింది. ఇది గతంలో నమోదైన 17,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ (20.03.2025) కంటే ఎక్కువ. ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయ అవసరాలు అధికమవడం వల్ల విద్యుత్ అవసరం, గరిష్ట లోడ్ రెండూ పెరిగాయి.

భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ

రాబోయే రోజుల్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు తమ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తూ కొనసాగుతాయి. రోజుకు 350కు పైగా మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం, సుమారు 19,000 మెగావాట్ల గరిష్ట లోడ్‌ను నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. బలమైన విద్యుత్ గ్రిడ్, సమన్వయంతో కూడిన కార్యాచరణ ప్రణాళికతో ఈ అవసరాలను ఎదుర్కొనే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. ఈ అధిక డిమాండ్ సమయంలో నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించినందుకు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల సిబ్బందిని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ అభినందించారు.

Advertisement
Advertisement