Bhatti Vikramarka | 8 వేల మెగావాట్ల అదనపు భారం.. అయినా విద్యుత్ కోతలు లేవు
Bhatti Vikramarka | రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గినప్పటికీ ప్రజలకు ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
జలవిద్యుత్ ఉత్పత్తి 4 వేల మెగావాట్లు తగ్గినా నిరంతర సరఫరా
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు పెరిగింది
గృహ వినియోగదారులకు 24 గంటలూ విద్యుత్ అందిస్తున్నాం
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గినప్పటికీ ప్రజలకు ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ఇదే సమయంలో రాష్ట్ర విద్యుత్ పీక్ డిమాండ్ 15 వేల మెగావాట్లు ఉండగా.. ప్రస్తుతం దాదాపు 20 వేల మెగావాట్లకు చేరిందన్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో నదులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గడంతో జలవిద్యుత్ ఉత్పత్తి సుమారు 4 వేల మెగావాట్లు తగ్గిందని చెప్పారు. దీంతో మొత్తంగా 8 వేల మెగావాట్ల అదనపు భారం ఏర్పడినప్పటికీ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు సమర్థంగా పనిచేస్తూ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాయని వెల్లడించారు.
పులిచింతల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, ఇప్పటివరకు జరిగిన ఉత్పత్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. యూనిట్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు.

అనంతరం మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జలవిద్యుత్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టుల యంత్రాలు, యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేసే స్థితిలోనే ఉన్నాయని చెప్పారు. అవసరమైన స్థాయిలో నీటి లభ్యత లేకపోవడం వల్లే జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గిందన్నారు. వర్షాభావ పరిస్థితులు, ఎండల తీవ్రత పెరగడం ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ గృహ వినియోగదారులకు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను థర్మల్ పవర్ ద్వారా అధిగమిస్తున్నామని తెలిపారు. ప్రజలు విద్యుత్ సరఫరాపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మనకంటే పెద్దదైన కర్ణాటకలో పీక్ విద్యుత్ డిమాండ్ సుమారు 20 వేల మెగావాట్లు ఉండగా.. తెలంగాణలోనూ ప్రస్తుతం అదే స్థాయికి చేరిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పీక్ డిమాండ్ సుమారు 12 వేల మెగావాట్లుగా ఉందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినప్పటికీ ప్రజలకు నిరంతర సరఫరా అందిస్తున్నామని చెప్పారు.
నీటి వినియోగంలో జాగ్రత్త అవసరం
రాబోయే రోజుల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోతే నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని తెలిపారు. తదుపరి వర్షాకాలం వరకు అందుబాటులో ఉన్న నీటిని మనుషులు, పశువులు, పక్షుల తాగునీటి అవసరాలకు జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. తాగునీటిని భవిష్యత్ కోసం నిల్వ చేసుకోవడం సాధ్యం కాదని, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు. విద్యుత్ రంగంలో నిరంతరం శ్రమిస్తున్న జెన్‌కో సిబ్బందికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
- ●Break Darshan Cancelled | తిరుమల భక్తులకు అలర్ట్.. పది బ్రేక్ దర్శనాలు రద్దు
- ●Nobel Prize 2026 | భౌతికశాస్త్రంలో ఫ్రాన్సిస్ హాల్జన్‌కు నోబెల్
- ●Jupally Krishna Rao | ఎల్‌నినో ఎఫెక్ట్.. బీర్ల ఉత్పత్తిపై లేనే లేదు
- ●Stock Markets | పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Rahul Ramakrishna | రాహుల్ రామకృష్ణ సూపర్ హిట్ కామెడీ మూవీకి సీక్వెల్ - హీరోగా మహేష్‌బాబు మేనల్లుడు
- ●Man Remanded to Judicial Custody | అకారణంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. వ్యక్తికి రిమాండ్ విధించిన కోర్టు

Break Darshan Cancelled | తిరుమల భక్తులకు అలర్ట్.. పది బ్రేక్ దర్శనాలు రద్దు

Nobel Prize 2026 | భౌతికశాస్త్రంలో ఫ్రాన్సిస్ హాల్జన్‌కు నోబెల్

Jupally Krishna Rao | ఎల్‌నినో ఎఫెక్ట్.. బీర్ల ఉత్పత్తిపై లేనే లేదు

Stock Markets | పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..





