Bhatti Vikramarka | 27 లక్షల మంది విద్యార్థులకు వేడి వేడి అల్పాహారం
Bhatti Vikramarka | రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ వేడివేడి అల్పాహారం అందించే కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదని, తెలంగాణలోనే ఈ వినూత్న పథకాన్ని అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
ఇలాంటి వినూత్న పథకం
ప్రపంచంలో ఎక్కడా లేదు
తెలంగాణలోనే తొలిసారి..
సంక్షేమం ఉచితం కాదు..
రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధికి పెట్టుబడి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ వేడివేడి అల్పాహారం అందించే కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదని, తెలంగాణలోనే ఈ వినూత్న పథకాన్ని అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం ఉచితం కాదని, అది రాష్ట్ర భవిష్యత్తు మానవ వనరులపై చేస్తున్న పెట్టుబడని పేర్కొన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకుంటేనే భవిష్యత్తులో రాష్ట్ర ఉత్పత్తికి పెద్ద ఎత్తున తోడ్పడతారని, తద్వారా జీఎస్‌డీపీ వృద్ధికి దోహదం చేస్తారని చెప్పారు.

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని మునగాల గ్రామంలో పాఠశాలల విద్యార్థుల కోసం రూ.9.6 కోట్లతో నిర్మించనున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌కు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు. 1,020 పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 60 వేల మంది విద్యార్థులకు ఒకే కిచెన్ నుంచి పరిశుభ్రమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేడివేడి అల్పాహారం అందించేందుకు మునగాలలో ఈ గ్రీన్‌ఫీల్డ్ కిచెన్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు వారానికి ఆరు రోజులపాటు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావ అందిస్తున్నామని చెప్పారు. ఇంటి వద్ద వంద మందికి వంట చేయడం కూడా కష్టమైన పరిస్థితుల్లో 27 లక్షల మంది విద్యార్థులకు ఏకకాలంలో అల్పాహారం అందించే కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇది తెలంగాణ ప్రభుత్వ మానవీయ దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తని అన్నారు. ఎదిగే వయసులో పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం అందిస్తేనే వారు ఆరోగ్యవంతమైన మానవ వనరుగా ఎదుగుతారని చెప్పారు. అందుకే పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు చిన్ననాటి నుంచే నాణ్యమైన ఆహారం అందిస్తూ, వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని వివరించారు.
సంక్షేమం ఉచితం కాదు.. పెట్టుబడే
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉచితాలుగా చూడొద్దని భట్టి విక్రమార్క అన్నారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులపై చేస్తున్న ఖర్చు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తిరిగి ప్రయోజనం చేకూర్చే పెట్టుబడిగా అభివర్ణించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండటం, పిల్లలు చదువుకోవడం, మహిళలు ఆర్థికంగా ఎదగడం, రైతులకు పెట్టుబడి సాయం అందడం ద్వారా రాష్ట్ర ఉత్పాదకత పెరుగుతుందని చెప్పారు. రైతు భరోసా, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, వడ్డీలేని రుణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి కార్యక్రమాలన్నింటి అంతిమ లక్ష్యం పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదగడమేనని అన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు.
నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ బీమా
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని తీసుకురానున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కుటుంబ యజమానికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భద్రత కల్పించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి కుటుంబం తమ కుటుంబానికి భద్రత ఉందనే ధైర్యంతో జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దేశంలోనే ప్రత్యేకమైన పథకంగా ఇందిరమ్మ కుటుంబ బీమాను అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
తాజావార్తలు
- ●ACB Raids | ఏసీబీకి చిక్కిన సీనియర్ అకౌంటెంట్
- ●Mumbai Ahmedabad Bullet Train | బుల్లెట్ రైలు ప్రాజెక్టులో బిగ్ ట్విస్ట్: జపాన్‌తో సిగ్నలింగ్ రగడ.. మేడ్ ఇన్ ఇండియా ట్రైన్‌తోనే తొలి జర్నీ!
- ●Indian Navy | సముద్రంలో నేవీ సింహగర్జన!
- ●Jio Platforms IPO | జియో ఐపీఓ విలువ రూ.11 లక్షల కోట్లు.. అతిపెద్ద లిస్టింగ్‌కు రెడీ..
- ●Singer Chinmayi | తెలుగు ఓటీటీ షోలో కంటెస్టెంట్‌గా సింగర్ చిన్మయి - బిగ్‌బాస్ కంటే డబుల్ ప్రైజ్‌మనీ
- ●Manne Krishank | మన్నె క్రిశాంక్‌కు షరతులు లేకుండా బెయిల్

ACB Raids | ఏసీబీకి చిక్కిన సీనియర్ అకౌంటెంట్

Mumbai Ahmedabad Bullet Train | బుల్లెట్ రైలు ప్రాజెక్టులో బిగ్ ట్విస్ట్: జపాన్‌తో సిగ్నలింగ్ రగడ.. మేడ్ ఇన్ ఇండియా ట్రైన్‌తోనే తొలి జర్నీ!

Indian Navy | సముద్రంలో నేవీ సింహగర్జన!

Jio Platforms IPO | జియో ఐపీఓ విలువ రూ.11 లక్షల కోట్లు.. అతిపెద్ద లిస్టింగ్‌కు రెడీ..






