త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CS Sanjay Jaju | ట్రాఫిక్‌ను త‌గ్గించేందుకే ఎన్‌హెచ్-44, ఎస్‌హెచ్‌-1 ఎలివేటెడ్ కారిడార్లు

CS Sanjay Jaju | రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదివారం ప్యారడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్లను పరిశీలించారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రతిపాదిత కారిడార్ల అలైన్‌మెంట్, కనెక్టివిటీ, భూసేకరణ, మౌలిక వసతుల అవసరాలను పరిశీలించారు.

S

Telangana | Published On Sep 6, 2026, 5.35 pm IST

CS Sanjay Jaju | ట్రాఫిక్‌ను త‌గ్గించేందుకే ఎన్‌హెచ్-44, ఎస్‌హెచ్‌-1 ఎలివేటెడ్ కారిడార్లు
Advertisement

CS Sanjay Jaju | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదివారం ప్యారడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్లను పరిశీలించారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రతిపాదిత కారిడార్ల అలైన్‌మెంట్, కనెక్టివిటీ, భూసేకరణ, మౌలిక వసతుల అవసరాలను పరిశీలించారు.

ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫార్మ్ రోడ్ వరకు ఎన్‌హెచ్‌-44పై, అలాగే ప్యారడైజ్ నుంచి బొల్లారం, గన్‌రాక్ ఎన్‌క్లేవ్, శామీర్‌పేట్ మీదుగా ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఎస్‌హెచ్‌-1 (రాజీవ్ రహదారి)పై ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్‌లకు సంబంధించిన ప్రణాళికలను అధికారులు సీఎస్‌కు వివరించారు.

కీలక ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ

ఈ ఎలివేటెడ్ కారిడార్లు అందుబాటులోకి వస్తే ప్యారడైజ్, సికింద్రాబాద్, బొల్లారం, గన్‌రాక్ ఎన్‌క్లేవ్, శామీర్‌పేట్ తదితర ప్రాంతాల మధ్య రవాణా కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఉత్తర హైదరాబాద్ ప్రాంతం నుంచి ఓఆర్ఆర్‌కు వేగవంతమైన అనుసంధానం ఏర్పడటంతో పాటు, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ కారిడార్లు దోహదపడనున్నాయి.

ప్రత్యేకించి సికింద్రాబాద్–బొల్లారం–శామీర్‌పేట్ మార్గంలో పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కారిడార్‌లను సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని సీఎస్ అధికారులకు వివరించారు.

ట్రాఫిక్ రద్దీ తగ్గింపునకు ప్రాధాన్యం

ప్యారడైజ్, బొల్లారం, గన్‌రాక్ ఎన్‌క్లేవ్, శామీర్‌పేట్ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ఎలివేటెడ్ కారిడార్ల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

ప్రాజెక్టు అమలులో భూసేకరణ, యుటిలిటీల మార్పిడి, వివిధ శాఖల మధ్య సమన్వయం, అవసరమైన అనుమతులు తదితర అంశాలను వేగంగా పరిష్కరించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఎలివేటెడ్ కారిడార్లతో పాటు మెట్రో రైలు, ప్రధాన రహదారులు, ఓఆర్ఆర్ మధ్య మెరుగైన అనుసంధానం ఏర్పడేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు.

ఈ పరిశీలనలో హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, మెట్రో రైలు, హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement