త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Auto Rally | కాంగ్రెస్ హామీల‌పై ఆటో ర్యాలీలు.. బీఆర్ఎస్‌ నిర‌స‌న‌ల హోరు

BRS Auto Rally | కాంగ్రెస్ ఇచ్చిన 420 మోసాల‌పై బీఆర్ఎస్ పోరుబాట ప‌ట్టింది. 100 రోజుల్లో హామీలు అమ‌లు చేస్తామ‌ని చెప్పి 1000 రోజులవుతున్నా అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను వంచించడంతో క‌దం తొక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆటోలు, బైక్ ర్యాలీల‌తో గులాబీ ద‌ళం నిర‌స‌న తెలియజేసింది.

S

Telangana | Published On Sep 6, 2026, 5.32 pm IST

BRS Auto Rally | కాంగ్రెస్ హామీల‌పై ఆటో ర్యాలీలు.. బీఆర్ఎస్‌ నిర‌స‌న‌ల హోరు
Advertisement
  • రాష్ట్ర వ్యాప్త నిర‌స‌న‌ల‌తో కాంగ్రెస్ 420 హామీల‌పై నిల‌దీత‌
  • స్వ‌యంగా ఆటోలు న‌డుపుతూ రేవంత్ స‌ర్కార్‌ను ఎండ‌గ‌ట్టిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు
  • హామీలు అమ‌లు చేసే కేసీఆర్ రాజీనామా విష‌యం మాట్లాడాల‌ని హిత‌వు

BRS Auto Rally | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ ఇచ్చిన 420 మోసాల‌పై బీఆర్ఎస్ పోరుబాట ప‌ట్టింది. 100 రోజుల్లో హామీలు అమ‌లు చేస్తామ‌ని చెప్పి 1000 రోజులవుతున్నా అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను వంచించడంతో క‌దం తొక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆటోలు, బైక్ ర్యాలీల‌తో గులాబీ ద‌ళం నిర‌స‌న తెలియజేసింది. బీఆర్ఎస్ స‌మ‌ర‌భేరిలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఆటోలు తోలుతూ త‌మ నిర‌స‌న‌ను తెలియజేశారు. బీఆర్ఎస్ అధినాయ‌కత్వం చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాల‌పై ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ ర్యాలీలు కొన‌సాగించారు.


హైద‌రాబాద్‌లో ప్ర‌ధానంగా తాగునీరు, వీధి దీపాలు, శాంతి భ‌ద్ర‌త‌లు, ట్రాఫిక్‌, బ‌స్తీ ద‌వాఖాన సాధ‌న కోసం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు శాంతియుతంగా ఆటో ర్యాలీలు నిర్వ‌హించారు. ఆదిలాబాద్, సింగ‌రేణి నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర‌స‌న స‌ద‌స్సులు చేప‌ట్టారు. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ల్లెల విధ్వంసం, ప‌డ‌కేసిన పారిశుద్ధ్య నిర్ల‌క్ష్య ధోర‌ణిపై గ్రామాల్లో నిర‌స‌న‌లు తెలియ‌జేశారు. ఈనెల 2 నుంచి చేప‌ట్టిన ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు 8 వ‌ర‌కు కొన‌సాగించ‌నున్నారు.

ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిన తీరును నిరసిస్తూ మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ ఆధ్వ‌ర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఆటో న‌డిపారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో భారీ ఆటో ర్యాలీ చేప‌ట్టారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆటో నడిపి నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12,000 ఇస్తామని మోసపూరిత హామీ ఇచ్చి, గద్దెనెక్కి వారి పొట్టకొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ఫైర‌య్యారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఆమె స్వయంగా ఆటో నడిపి మద్దతు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో చెత్త‌ను శుభ్రం చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన శ్రీరాంపూర్ డివిజన్ సింగరేణి కార్మికుల సంరక్షణ సదస్సులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌, మాజీ ఎమ్మెల్యే దివాక‌ర్‌రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement