Traffic restrictions | రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాల్లో అసలు వెళ్లకండి..
Traffic restrictions | ఈ నెల 6న ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ వద్ద దివ్యాంగులు, రైతులు, ప్రజా సంఘాలు కలిసి మహాధర్నా నిర్వహించనున్నారు. అంతేకాకుండా ట్యాంక్ బండ్ పాత అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Traffic restrictions | త్రినేత్ర.న్యూస్ : ఈ నెల 6న ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ వద్ద దివ్యాంగులు, రైతులు, ప్రజా సంఘాలు కలిసి మహాధర్నా నిర్వహించనున్నారు. అంతేకాకుండా ట్యాంక్ బండ్ పాత అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా పార్క్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సచివాలయంతో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ ఆంక్షలు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- నల్లకుంట నుండి స్టీల్ బ్రిడ్జ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కట్టమైసమ్మ వైపు అనుమతించరు. ఈ వాహనాలను అజామాబాద్ ఎక్స్ రోడ్ వద్ద వీఎస్టీ ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు.
- ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి ఇందిరా పార్కు వైపు వచ్చే వాహనాలను అశోక్ నగర్ ఎక్స్ రోడ్స్ వద్ద హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్ 8 లేదా బకారం బ్రిడ్జి, కవాడిగూడ వైపు మళ్లిస్తారు.
- కర్బలా వైపు నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ – గాంధీనగర్ టి-జంక్షన్ – డీబీఆర్ మిల్స్ – లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు.
- బీజేఆర్ విగ్రహం నుంచి పాత అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ టీ జంక్షన్ వద్ద హిమాయత్ నగర్ వైపు మళ్లించనున్నారు.
- హిమాయత్‌నగర్ నుండి పాత అంబేడ్కర్ విగ్రహం, సెక్రటేరియట్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అంబేడ్కర్ విగ్రహం వైపు అనుమతించరు. ఈ వాహనాలను బషీర్‌బాగ్ ఎక్స్ రోడ్ / హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కాంప్లెక్స్ వైపు మళ్లిస్తారు.
- ఇక్బాల్ మినార్ నుండి లిబర్టీ జంక్షన్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను లిబర్టీ జంక్షన్ వైపు అనుమతించరు. ఈ వాహనాలను పాత అంబేడ్కర్ జంక్షన్ వద్ద అప్పర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు.
తాజావార్తలు
- ●Teej Festival | తీజ్ పండుగ.. పెళ్లి కాని యువతులు ఇలా చేస్తే మంచి భర్త దొరుకుతాడట..!
- ●CM Revanth Reddy | సిరిసిల్ల, సిద్దిపేటలపై ఇక దండయాత్రే
- ●Bigg Boss 10 Telugu | బిగ్‌బాస్ 10 తెలుగు లాంఛ్ ఎపిసోడ్‌కు గెస్ట్ కన్ఫామ్ - షో టెలికాస్ట్ టైమ్ ఛేంజ్!
- ●కేప్ టౌన్ కు ఆ ఇద్దరు? అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులేనా?
- ●CM Revanth Reddy | కేసీఆర్ రాజీనామా చేయ్.. గజ్వేల్‌లోనే తేల్చుకుందాం
- ●CM Revanth Reddy | నీ చదువేందో.. నా చదువేందో సభలో తేల్చకుందాం రా.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్

Teej Festival | తీజ్ పండుగ.. పెళ్లి కాని యువతులు ఇలా చేస్తే మంచి భర్త దొరుకుతాడట..!

CM Revanth Reddy | సిరిసిల్ల, సిద్దిపేటలపై ఇక దండయాత్రే

Bigg Boss 10 Telugu | బిగ్‌బాస్ 10 తెలుగు లాంఛ్ ఎపిసోడ్‌కు గెస్ట్ కన్ఫామ్ - షో టెలికాస్ట్ టైమ్ ఛేంజ్!

కేప్ టౌన్ కు ఆ ఇద్దరు? అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులేనా?




