The Paradise Movie | ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై క్లారిటీ.. ఊహాగానాలకు చెక్ పెట్టిన మూవీ టీమ్..!
The Paradise Movie | నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
Entertainment | Published On Sep 6, 2026, 4.57 pm IST
The Paradise Movie | నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం నాని అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఏషనాగుల’ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. మాస్ టచ్‌తో సాగే ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ కావడంతో సోషల్ మీడియాలోనూ మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
దీంతో సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ది ప్యారడైజ్’ మేకర్స్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారమే సెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’ను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఓ వీడియో ద్వారా అధికారికంగా వెల్లడించారు. దీంతో కొంతకాలంగా కొనసాగుతున్న రిలీజ్ డేట్ మార్పుపై ఊహాగానాలకు చెక్ పడినట్లయ్యింది. అయితే, ఈ పాన్ ఇండియా సినిమాను హిందీలో విడుదల చేసే ఆలోచన మేకర్స్‌కు లేదనే ప్రచారం ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతోంది. ఈ వార్తపై ఇప్పటివరకు చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ‘ది ప్యారడైజ్’ హిందీ రిలీజ్ ఉంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●US Iran Conflict | 'యుద్ధ నియమాలు మారాయి.. బదులు ఊహించని విధంగా ఉంటుంది': అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ●Family Killed in Thrissur | ఫోన్ మాట్లాడేందుకు బైక్ ఆపారు.. అంతలోనే కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు!
- ●Maheshkumar Goud | ప్రతిపక్ష నేత హోదాను అపహాస్యం చేయడం సరికాదు
- ●UN Map Resolution | ప్రపంచ మ్యాప్‌ల మార్పుపై UN రిజల్యూషన్‌కు ఇండియా ఓకే.. కానీ కశ్మీర్ విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్!
- ●Chirumarthi Lingaiah | నిధులు తెస్తారనుకుంటే ఒంటి నిండా విషంతో వచ్చిండు
- ●Anaswara Rajan | అచ్చం చిన్న కేరళలా అనిపించింది : అనస్వర రాజన్

US Iran Conflict | 'యుద్ధ నియమాలు మారాయి.. బదులు ఊహించని విధంగా ఉంటుంది': అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

Family Killed in Thrissur | ఫోన్ మాట్లాడేందుకు బైక్ ఆపారు.. అంతలోనే కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు!

Maheshkumar Goud | ప్రతిపక్ష నేత హోదాను అపహాస్యం చేయడం సరికాదు

UN Map Resolution | ప్రపంచ మ్యాప్‌ల మార్పుపై UN రిజల్యూషన్‌కు ఇండియా ఓకే.. కానీ కశ్మీర్ విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్!






