US Iran Conflict | ‘యుద్ధ నియమాలు మారాయి.. బదులు ఊహించని విధంగా ఉంటుంది’: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
గల్ఫ్ ప్రాంతంలో తమ ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా చేసిన దాడికి మరింత భయంకరమైన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. యుద్ధ నియమాలు మారాయంటూ వార్నింగ్ ఇచ్చింది.
International | Published On Sep 6, 2026, 5.03 pm IST
సంక్షిప్త సారాంశం
గల్ఫ్ సముద్ర జలాల్లో తమ చమురు ట్యాంకర్లపై అమెరికా చేసిన దాడులపై ఇరాన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇకపై తమ భద్రతకు ముప్పు వాటిల్లితే మరింత వేగంగా, ఘోరంగా బదులిస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన నౌకలను, ఇతర ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. మరోవైపు, ట్రంప్ సర్కార్ 'ఆపరేషన్ ఎకనామిక్ ఔట్‌కాస్ట్' పేరిట ఇరాన్‌పై ఆర్థికపరమైన ఆంక్షలను పెంచుతోంది.
US Iran Conflict | త్రినేత్ర.న్యూస్ : ఇరాన్ (Iran), అమెరికా (US) మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. గల్ఫ్ జలాల్లో తమ ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారం మరింత భయంకరంగా ఉంటుందని ఇరాన్ తీవ్రస్థాయిలో హెచ్చరించింది. "యుద్ధ నియమాలు మారాయి.. సమయం మించిపోకముందే వాషింగ్టన్ ఈ విషయాన్ని గ్రహించాలి" అని తేల్చిచెప్పింది.
శనివారం నాడు ఇరాన్‌కు చెందిన పలు చమురు ట్యాంకర్లపై అమెరికా దాడులు చేసిన ఒక రోజు తర్వాత ఈ హెచ్చరికలు రావడం గమనార్హం. "ఇకపై ఇరాన్ భద్రతపై, మా ప్రయోజనాలపై ఏ చిన్న దాడి జరిగినా.. దానికి మునుపటి కంటే వేగంగా, మరింత భారీగా బదులిస్తాం" అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గలీబాఫ్ (Mohammad Bagher Ghalibaf) టెలిగ్రామ్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ విజయం సాధించిందని, ఇక యుద్ధాన్ని ఆపేయాలని ఆ దేశపు సీనియర్ నాయకత్వం భావిస్తున్న తరుణంలో ఈ సడన్ ట్విస్ట్ చోటుచేసుకోవడం గమనార్హం.
నౌకలను టార్గెట్ చేశామన్న ఇరాన్
హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన అమెరికా నౌకను తాము ఢీకొట్టినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం ప్రకటించింది. అయితే మిడిల్ ఈస్ట్‌లో అమెరికా మిలిటరీ ఆపరేషన్లను పర్యవేక్షించే సెంట్రల్ కమాండ్ (CENTCOM) దీనిపై స్పందించలేదు. అంతేకాకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ రూట్‌లో ప్రయాణిస్తున్న మూడు ఆయిల్ ట్యాంకర్లతో పాటు అమెరికాతో సంబంధం ఉన్న పలు నౌకలను కూడా టార్గెట్ చేసినట్లు ఇరాన్ వెల్లడించింది.
సెంట్‌కామ్ ఏమంటోందంటే..
ప్రాంతీయ జలాల్లో పహారా కాస్తున్న తమ నేవీ షిప్‌లపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) క్షిపణి దాడులు చేయడంతోనే.. తాము ఎదురుదాడికి దిగినట్లు అమెరికా సెంట్‌కామ్ (CENTCOM) తెలిపింది. ఏమాత్రం రెచ్చగొట్టకుండానే ఇరాన్ ఈ దాడులకు పాల్పడిందని, తమ సిబ్బందికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. ఈ దాడులకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చింది. "అమెరికా బలగాలను రక్షించుకునేందుకు మేం ఏమాత్రం వెనకాడం. అవసరమైతే ఇరాన్ ఆయిల్ ఫ్లీట్‌ను పూర్తిగా నాశనం చేస్తాం" అని కమాండర్ బ్రాడ్ కూపర్ హెచ్చరించారు.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో మొదలైన ఈ యుద్ధం, ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంతో కాస్త సద్దుమణిగింది. కానీ హార్ముజ్ జలసంధి వివాదంతో మళ్లీ దాడులు మొదలయ్యాయి. ఇరు వర్గాలు సముద్ర మార్గంలో కాల్పులకు తెగబడుతున్నాయి. మరోవైపు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ (Trump administration) 'ఆపరేషన్ ఎకనామిక్ ఔట్‌కాస్ట్' (Operation Economic Outcast) ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ఫైనాన్షియల్ ఆంక్షలను తీవ్రతరం చేస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

US MQ-9 Reaper | ఫైటర్ జెట్ కంటే ఖరీదైన అమెరికా ‘MQ-9 రీపర్’ డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్.. మరి భారత్ వద్ద ఉన్న డ్రోన్ల సంగతేంటి?
ఆగస్టు 31, 2026

Strait of Hormuz | హోర్ముజ్‌లో ఉద్రిక్తతలు ఉన్నా, కొనసాగుతున్న చమురు రవాణా..అమెరికా ఇంధన శాఖ మంత్రి వెల్లడి..
ఆగస్టు 22, 2026

Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Family Killed in Thrissur | ఫోన్ మాట్లాడేందుకు బైక్ ఆపారు.. అంతలోనే కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు!
- ●Maheshkumar Goud | ప్రతిపక్ష నేత హోదాను అపహాస్యం చేయడం సరికాదు
- ●UN Map Resolution | ప్రపంచ మ్యాప్‌ల మార్పుపై UN రిజల్యూషన్‌కు ఇండియా ఓకే.. కానీ కశ్మీర్ విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్!
- ●Chirumarthi Lingaiah | నిధులు తెస్తారనుకుంటే ఒంటి నిండా విషంతో వచ్చిండు
- ●Anaswara Rajan | అచ్చం చిన్న కేరళలా అనిపించింది : అనస్వర రాజన్
- ●Delhi Building Collapse | పేకమేడలా కూలిన 4 అంతస్తుల పీజీ హాస్టల్.. శిథిలాల కింద విద్యార్థుల హాహాకారాలు

Family Killed in Thrissur | ఫోన్ మాట్లాడేందుకు బైక్ ఆపారు.. అంతలోనే కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు!

Maheshkumar Goud | ప్రతిపక్ష నేత హోదాను అపహాస్యం చేయడం సరికాదు

UN Map Resolution | ప్రపంచ మ్యాప్‌ల మార్పుపై UN రిజల్యూషన్‌కు ఇండియా ఓకే.. కానీ కశ్మీర్ విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్!

Chirumarthi Lingaiah | నిధులు తెస్తారనుకుంటే ఒంటి నిండా విషంతో వచ్చిండు



