త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maheshkumar Goud | ప్ర‌తిప‌క్ష నేత హోదాను అపహాస్యం చేయడం సరికాదు

Maheshkumar Goud | జీతం తీసుకుంటూ ఫాంహౌస్‌కే ప‌రిమిత‌మైన కేసీఆర్.. ప్ర‌తిప‌క్ష నేత హోదాని అప‌హాస్యం చేయ‌డం స‌రికాద‌ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజాస్వామిక దేశంలో ప్రతిపక్ష నాయకులు బాధ్యత గల పదవిలో ఉన్నట్టు లేక్క అని వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Sep 6, 2026, 4.09 pm IST

Maheshkumar Goud | ప్ర‌తిప‌క్ష నేత హోదాను అపహాస్యం చేయడం సరికాదు
Advertisement
  • ప్ర‌జాస్వామిక దేశంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కులు బాధ్య‌త గ‌ల ప‌ద‌విలో ఉన్న‌ట్లు లెక్క‌
  • మేం త‌ప్పు చేస్తే ప్ర‌తిప‌క్షాలు ఎత్తిచూపాలి
  • తప్పిదాలు జరిగితే సరిదిద్దుకుంటాం
  • ప్రజాపాలన అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్‌కు క‌నిపిస్త‌లేదా?
  • ఇందిరాపార్క్ మ‌హాధ‌ర్నాలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

Maheshkumar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: జీతం తీసుకుంటూ ఫాంహౌస్‌కే ప‌రిమిత‌మైన కేసీఆర్.. ప్ర‌తిప‌క్ష నేత హోదాని అప‌హాస్యం చేయ‌డం స‌రికాద‌ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజాస్వామిక దేశంలో ప్రతిపక్ష నాయకులు బాధ్యత గల పదవిలో ఉన్నట్టు లేక్క అని వ్యాఖ్యానించారు. అధికారం ప్రజలు ఇచ్చే కానుకన్నారు. మేం త‌ప్పులు చేస్తే ప్ర‌తిప‌క్షాలు ఎత్తిచూపాల‌ని.. వాటిని స‌రిదిద్దుకుంటామ‌ని పేర్కొన్నారు. ప్ర‌జా పాల‌నలో జ‌రుగుతున్న‌ అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్‌కు క‌నిపిస్త‌లేదా అని ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ వ‌ద్ద ఆదివారం నిర్వ‌హించిన మ‌హా ధ‌ర్నాలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.

ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పాలన అందిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నాం. ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి హామీల అమలు చేస్తున్నాం. గత బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ కూతలు కూసి మొఖం చాటేశారు. మా ధ్యేయం ఇళ్లు లేనివారికి ఇల్లు ఇవ్వాలి.

బీఆర్ఎస్ హయాంలో వైద్యం అంటే కార్పొరేట్ సెక్టార్. చదువుతో పాటు సంస్కారం అవసరం కేటీఆర్. రెండేళ్లలో లక్ష 78 వేల కోట్లు విదేశీ పెట్టుబడులు, గ్లోబల్ సమ్మిట్ తో 5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇంకో రెండున్నర ఏళ్లలో మరిన్ని ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రజాపాలన ప్రభుత్వంలో 70 వేల‌కు పైగా ఉద్యోగాలు ఇచ్చాం.

ఉద్యమకారులు గద్దర్, అందే శ్రీని కేసీఆర్ విస్మరించారు. మా హయాంలో గద్దర్ పేరిట అవార్డులు ఇస్తున్నాం. జ్యోతి బా పూలే దంపతుల విగ్రహాలు ఆవిష్కరించి గౌరవించాం. రాహుల్ గాంధీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రాహుల్ గాంధీ నినాదం మేరకు సీఎం రేవంత్, మంత్రుల నేతృత్వంలో కుల సర్వే నిర్వహించాం.
కుల సర్వేతో తెలంగాణ‌ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచింది.

జనగణనలో కుల గణన చేపడ‌తాం..

బీజేపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడటం తప్ప చేసింది ఏమి లేదు. జనగణనలో కుల గణన చేపట్టేలా కృషి చేస్తాం. మహిళా సాధికారత కేంద్రంగా ప్రజాపాలన సాగుతుంది. జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ మొఖం చాటేశారు. ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయాలి. ప్రతిపక్ష నేత హోదాని అపహాస్యం చేయడం సరికాదు. అధికారం, ప్రభుత్వాలు, పదవులు శాశ్వతం కాదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నా. అసత్యాలు ప్రచారం చేయడం సబబు కాదు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం జ‌రుగుతోంది అని మ‌హేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement