Madhuri Rathod | ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!
Madhuri Rathod | ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఈశ్వర్ సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Entertainment | Published On Sep 6, 2026, 2.24 pm IST
- పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఈశ్వర్ సాయిపై పోలీసులకు ఫిర్యాదు
- ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయలేదని ఆవేదన
Madhuri Rathod | ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఈశ్వర్ సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతున్న మాధురిని కుటుంబ సభ్యులు గుర్తించి.. తలుపులు పగలగొట్టి బయటకు తీసుకొచ్చి కాపాడారు. ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మాధురి ఆవేదన వ్యక్తం చేసింది. నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించింది.
పెళ్లి పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు
ఇటీవల ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇద్దరూ కలిసి జానపద పాటలు, డ్యాన్స్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆగస్టులో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇద్దరూ ఒకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి చేరుకోవడంతో వివాదం మొదలైంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటన అనంతరం మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది. ఆగస్టు 22న వేములవాడ పోలీస్ స్టేషన్‌లో ఈశ్వర్ సాయి భార్యపై ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని, తనను శారీరకంగా ఉపయోగించుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఈశ్వర్ సాయి కోసం గాలింపు
మాధురి రాథోడ్ ఫిర్యాదు మేరకు సెప్టెంబరు 1న నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై కేసు నమోదు చేశారు. ఆమె ఫోన్‌లోని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను ఉపయోగించి తన పరువుకు భంగం కలిగించేలా కృత్రిమ మేధ (ఏఐ)తో ఫేక్ వీడియోలు రూపొందించి ప్రచారం చేశారని కూడా ఫిర్యాదులో ఆరోపించింది. మాధురి ఫిర్యాదుతో ఈశ్వర్ సాయి పరారయ్యాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ponnam Sathaiah Awards | తెలంగాణ కృషీవలురకు ఘన గౌరవం.. ముగ్గురికి పొన్నం సత్తయ్య పురస్కారాలు
- ●Congress Dharna | అసెంబ్లీకి రారు.. ప్రతిపక్ష పాత్రపోషించరు..
- ●Ramchandar Rao | రెండేళ్ల తర్వాత ఇంకా మీరుంటరా ఏంది.. అప్పుడు మేమొస్తం
- ●Harish Rao | ప్రతిపక్షాలను తిట్టడంపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర బిడ్డల గోసపై లేదా?
- ●Jagadish Reddy | కాంగ్రెస్ నేతల లాగుతడుస్తంది
- ●Sridhar Babu | కేసీఆర్ తీరు మారకుంటే.. బీఆర్ఎస్ మరో పదేండ్లు రోడ్లపైనే: మంత్రి శ్రీధర్ బాబు

Ponnam Sathaiah Awards | తెలంగాణ కృషీవలురకు ఘన గౌరవం.. ముగ్గురికి పొన్నం సత్తయ్య పురస్కారాలు

Congress Dharna | అసెంబ్లీకి రారు.. ప్రతిపక్ష పాత్రపోషించరు..

Ramchandar Rao | రెండేళ్ల తర్వాత ఇంకా మీరుంటరా ఏంది.. అప్పుడు మేమొస్తం

Harish Rao | ప్రతిపక్షాలను తిట్టడంపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర బిడ్డల గోసపై లేదా?



