NTR Movie | ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీపై క్రేజీ అప్‌డేట్.. ఇద్దరు భామలతో స్పెషల్ సాంగ్‌కు ప్లాన్!
Dragon | యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. వర్కింగ్ టైటిల్‌గా ‘డ్రాగన్’, ‘బ్రూస్ లీ’ పేర్లు వినిపిస్తుండగా.. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Entertainment | Published On Sep 6, 2026, 5.25 pm IST
NTR Movie | యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. వర్కింగ్ టైటిల్‌గా ‘డ్రాగన్’, ‘బ్రూస్ లీ’ పేర్లు వినిపిస్తుండగా.. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీకి సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్‌ను అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీ సెట్‌ను నిర్మిస్తున్నారట.
భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ పాటలో విజువల్స్ ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉండనున్నాయని టాక్. ముఖ్యంగా ఎన్టీఆర్ తన డ్యాన్స్‌తో అదరగొట్టనున్నారని, ఆయనతో పాటు రుక్మిణీ వసంత్ కూడా ఈ సాంగ్‌లో స్టెప్పులు వేయనున్నారని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ స్పెషల్ సాంగ్‌లో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా కనిపించనున్నారట. అయితే, ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. దీంతో ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరై ఉంటారనే ఆసక్తి అభిమానుల్లో చర్చ జరుగుతోంది.
ఇక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయని సమాచారం. ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ యాక్షన్, భారీ ఎలివేషన్స్‌తో ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. సినిమాను ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓ బెస్ట్ మూవీగా నిలిపేందుకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కథ, స్క్రీన్‌ప్లేపై ప్రశాంత్ నీల్ చాలా సమయం కేటాయించారట. అందుకే ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన చిత్రాల్లోనే ఈ సినిమా అత్యంత భారీగా, ప్రత్యేకంగా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్‌కు తోడు.. స్పెషల్ సాంగ్, భారీ యాక్షన్ అనే వార్తలు సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CS Sanjay Jaju | ట్రాఫిక్‌ను తగ్గించేందుకే ఎన్‌హెచ్-44, ఎస్‌హెచ్-1 ఎలివేటెడ్ కారిడార్లు
- ●BRS Auto Rally | కాంగ్రెస్ హామీలపై ఆటో ర్యాలీలు.. బీఆర్ఎస్ నిరసనల హోరు
- ●US Iran Conflict | 'యుద్ధ నియమాలు మారాయి.. బదులు ఊహించని విధంగా ఉంటుంది': అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ●The Paradise Movie | ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై క్లారిటీ.. ఊహాగానాలకు చెక్ పెట్టిన మూవీ టీమ్..!
- ●Family Killed in Thrissur | ఫోన్ మాట్లాడేందుకు బైక్ ఆపారు.. అంతలోనే కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు!
- ●Maheshkumar Goud | ప్రతిపక్ష నేత హోదాను అపహాస్యం చేయడం సరికాదు

CS Sanjay Jaju | ట్రాఫిక్‌ను తగ్గించేందుకే ఎన్‌హెచ్-44, ఎస్‌హెచ్-1 ఎలివేటెడ్ కారిడార్లు

BRS Auto Rally | కాంగ్రెస్ హామీలపై ఆటో ర్యాలీలు.. బీఆర్ఎస్ నిరసనల హోరు

US Iran Conflict | 'యుద్ధ నియమాలు మారాయి.. బదులు ఊహించని విధంగా ఉంటుంది': అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

The Paradise Movie | ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై క్లారిటీ.. ఊహాగానాలకు చెక్ పెట్టిన మూవీ టీమ్..!





