త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stampede | రామ్‌న‌గ‌ర్‌లో గ‌ణేశ్ ఆగ‌మ‌న్ ర్యాలీ.. తొక్కిస‌లాట‌లో యువ‌కుడు మృతి

Stampede | హైద‌రాబాద్ రామ్‌న‌గ‌ర్ (Ramnagar) చౌర‌స్తాలో విషాదం చోటుచేసుకుంది. వినాయ‌క చ‌వితి నేప‌థ్యంలో స్థానిక యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో గ‌ణేశ్ ఆగ‌మ‌న్ (Ganesh Agaman) కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

G

Hyderabad | Published On Sep 6, 2026, 12.06 pm IST

Stampede | రామ్‌న‌గ‌ర్‌లో గ‌ణేశ్ ఆగ‌మ‌న్ ర్యాలీ.. తొక్కిస‌లాట‌లో యువ‌కుడు మృతి
Advertisement

Stampede | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ రామ్‌న‌గ‌ర్ (Ramnagar) చౌర‌స్తాలో విషాదం చోటుచేసుకుంది. వినాయ‌క చ‌వితి నేప‌థ్యంలో స్థానిక యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో గ‌ణేశ్ ఆగ‌మ‌న్ (Ganesh Agaman) కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తొక్కిస‌లాట (Stampede) జ‌ర‌గ‌డంతో ఓ యువ‌కుడు ప్రాణాలు కోల్పోయాడు.

రాంనగర్ చౌరస్తాలో శ్రీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేశ్‌ ఆగమనం సంద‌ర్భంగా భారీ ఊరేగింపు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి పెద్ద‌ సంఖ్యలో యువ‌త‌, భక్తులు హాజ‌ర‌య్యారు. భక్తులంతా ఒక్కసారిగా గూమిగూడడంతో తొక్కిసలాట జ‌రిగింది. దీంతో కింద‌ప‌డిన బద్రీనాథ్ (19) అనే యువ‌కుడు తీవ్రంగా గాయ‌ప‌డి మృతి చెందాడు. రాంనగర్‌లోని గౌరీశంకర్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న అత‌డిని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కడప (Kadapa) జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అబిడ్స్‌లోని మెథ‌డిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీలో బీటెక్ (Engineering Student) చ‌దువుతున్నాడ‌ని పోలీసులు తెలిపారు. డీజే చ‌ప్పుళ్ల మ‌ధ్య యువకులు డ్యాన్స్ చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement