AYUSH | ఆయుష్ విభాగంలో లెక్చరర్లు.. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
AYUSH | ఆయుష్ విభాగంలో ( AYUSH) లెక్చరర్లు, టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 70 పోస్టులను భర్తీ చేస్తున్నది.
AYUSH | త్రినేత్ర న్యూస్: ఆయుష్ విభాగంలో ( AYUSH) లెక్చరర్లు, టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 70 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ వైద్య విధానాలకు సంబంధించి 45 స్పెషాలిటీల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
హోమియోపతి విభాగంలో 11 స్పెషాలిటీల్లో, యునానీ విభాగంలో లెక్చరర్ పోస్టులతో పాటు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఆయుర్వేద విభాగంలో 14 లెక్చరర్ స్పెషాలిటీలతో పాటు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26 నుంచి ఎంహెచ్‌ఎస్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 2 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి.
మొత్తం ఖాళీలు: 70
ఇందులో మల్టీజోన్-1లో 15, మల్టీ జోన్-2లో 21, రాష్ట్రస్థాయి పోస్టులు 34 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. అభ్యర్థులు 18 నుంచి 44 ఏండ్లలోపు వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్షకు 80 పాయింట్లు, ప్రభుత్వ దవాఖానల్లో సర్వీస్‌కు 20 పాయింట్లు ఉంటాయి.
జీతం: లెక్చరర్ పోస్టులకు ప్రతి నెల రూ.54,220 నుంచి రూ.1,33,630, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.51,320 నుంచి రూ.1,27,310 వరకు వస్తుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్వాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, నిరుద్యోగులకు దరఖాస్తు ఫీజు లేదు. ప్రాసెసింగ్ ఫీజు రూ.200 అందరూ చెల్లించాల్సిందే.
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 26
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 2
వెబ్‌సైట్: https://mhsrb.telangana.gov.in/
తాజావార్తలు
- ●Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం
- ●HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!
- ●Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం
- ●AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!
- ●Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- ●Nagarguna Sagar | నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా

Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం

HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!

Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం

AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!





