త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao tweet on Revanth Reddy | శంకరమ్మకు కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే.. ఓడించింది మీ మంత్రి కాదా?

సిద్దిపేట సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. నిలిపేసిన రూ.1070 కోట్ల పనులు, సంక్షేమ పథకాల రద్దుపై ఆయన నిలదీశారు.

J

Telangana | Published On Nov 19, 2026, 9.43 pm IST

Harish Rao tweet on Revanth Reddy | శంకరమ్మకు కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే.. ఓడించింది మీ మంత్రి కాదా?

సంక్షిప్త సారాంశం

సిద్దిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో ప్రజల ఎజెండా, కరువు రైతులకు భరోసా లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటకు నిలిపివేసిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనులు, ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఊసే లేదని ఆయన 'ఎక్స్' వేదికగా ప్రశ్నించారు. కేసీఆర్ కిట్, దళిత బంధు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిలిపివేసిందని హరీష్ రావు ఆరోపించారు. తాడి చెట్టు, గడ్డం అంటూ బాడీ షేమింగ్ చేయడం తగదని, గౌడన్నల కల్పతరువును అవమానించినందుకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement
  • సీఎం ప్రసంగంపై విమర్శలు
  • పెండింగ్ నిధుల ప్రస్తావన
  • పథకాల రద్దుపై ఆరోపణలు
  • వ్యక్తిగత విమర్శలపై అభ్యంతరం
  • ఆ నిధులపై సూటి ప్రశ్న
  • సీఎం రేవంత్ సభపై హరీష్ రావు ట్వీట్

Harish Rao tweet on Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : సిద్దిపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి,  టి. హరీష్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. గంటకు పైగా సాగిన సీఎం ప్రసంగంలో ప్రగల్భాలు తప్ప ప్రజా సమస్యల ప్రస్తావన లేదని ఆయన విమర్శించారు. ఈ మేరకు హరీష్ రావు 'ఎక్స్' వేదికగా సుదీర్ఘ పోస్ట్ ద్వారా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.

సిద్దిపేట నిధులు, రైతుల సమస్యలపై నిలదీత

కరువు పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న రైతులకు సీఎం ప్రసంగంలో ఎలాంటి ఊరట లభించలేదని హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట నియోజకవర్గానికి నిలిపివేసిన రూ.1,070 కోట్ల పెండింగ్ పనుల గురించి కానీ, ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం గురించి కానీ సీఎం ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. దేవుళ్లపై ఒట్లు వేసి రైతులను మోసం చేశారని ఆయన విమర్శించారు.

బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై అభ్యంతరం

సభలో సీఎం చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను హరీష్ రావు తప్పుబట్టారు. 'తాడి చెట్టు, గడ్డం' అంటూ బాడీ షేమింగ్ చేయడం సరికాదని పేర్కొన్నారు. భూమిలో బలమైన వేర్లు ఉండటం వల్లే తాడి చెట్టు తుఫాన్లను సైతం తట్టుకుని నిలబడుతుందని వ్యాఖ్యానించిన ఆయన, గౌడన్నల జీవనాధారమైన కల్పతరువు తాడి చెట్టును పదేపదే తూలనాడినందుకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మెడికల్ కాలేజీలు, రాజకీయ విమర్శలకు సమాధానం

గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన వాటికి రిబ్బన్లు కట్ చేయడం, తాము ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు కొత్త పేర్లు పెట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని హరీష్ రావు విమర్శించారు.

గతంలో కేసీఆర్.. శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే, ఆమెను ఓడించింది ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు.

దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి క్యాన్సర్ బారిన పడినప్పుడు, కేసీఆర్ కోట్లు వెచ్చించి అమెరికా పంపి వైద్యం చేయించారని గుర్తు చేశారు.

నిలిపివేసిన పథకాల లిస్ట్ ఇదేనంటూ ఆరోపణ

గత ప్రభుత్వ పథకాలేవీ రద్దు చేయలేదని సీఎం చెప్పడం అవాస్తవమని హరీష్ రావు ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిన పథకాల జాబితా చాలా పెద్దదని పేర్కొంటూ, పలు పథకాల పేర్లను ఆయన తన ట్వీట్‌లో ప్రస్తావించారు.

కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మి, ఫీజు రీయింబర్స్‌మెంట్, దళిత బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, మన ఊరు - మన బడి, కంటి వెలుగు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్.

సిద్దిపేటకు ఒక్క రూపాయి మేలు చేయకుండా కేవలం విమర్శలు చేసేందుకే సీఎం సభ నిర్వహించారని హరీష్ రావు తన పోస్ట్‌లో మండిపడ్డారు.

Advertisement
Advertisement