త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bulletproof Jackets | అసెంబ్లీ ఎన్నిక‌లు.. సీఎం యోగి స‌హా 52 మందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు

Bulletproof Jackets | వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు (Uttar Pradesh Assembly Elections) జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని యోగి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, అఖిలేష్ యాదవ్, మాయావ‌తి స‌హా 52 మంది రాజ‌కీయ నేత‌ల‌కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల‌ను స‌మ‌కూర్చింది.

D

National | Published On Aug 22, 2026, 4.37 pm IST

Bulletproof Jackets | అసెంబ్లీ ఎన్నిక‌లు.. సీఎం యోగి స‌హా 52 మందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు
Advertisement

Bulletproof Jackets | త్రినేత్ర‌.న్యూస్ : వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు (Uttar Pradesh Assembly Elections) జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని యోగి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌లువురు రాజ‌కీయ నేత‌ల భ‌ద్ర‌త‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ (CM Yogi Adityanath), సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి (BSP chief Mayawati) స‌హా సుమారు 52 మంది రాజ‌కీయ నేత‌ల‌కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల‌ను (Bulletproof Jackets) స‌మ‌కూర్చింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్ల‌డించింది.

ఒక్కో జాకెట్ ధర సుమారు రూ. 10 లక్షల వ‌ర‌కూ ఉంటుంద‌ని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదటి దశలో భాగంగా ఎనిమిది మంది నాయకులకు, రెండో దశలో 44 మంది నాయకులకు ఈ జాకెట్లను అందజేసినట్లు స‌ద‌రు వ‌ర్గాలు పేర్కొన్నాయి. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు పొందిన వారిలో సంజయ్ నిషాద్, నంద్ గోపాల్ గుప్తా, ఓం ప్రకాష్ రాజ్‌భర్‌తోపాటూ బీజేపీ నాయకురాలు అపర్ణా యాదవ్‌ సహా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 11 మంది మంత్రులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని మ‌రో 98 మంది ఇత‌ర ముఖ్య నేత‌ల‌కు ప్ర‌త్యేక‌మైన భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌నున్న‌ట్లు స‌ద‌రు వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

సామాజిక సమీకరణాలపై బీజేపీ దృష్టి..

2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో మ‌రోసారి అధికారాన్ని నిల‌బెట్టుకోవాల‌నే ల‌క్ష్యంతో సామాజిక‌, కుల స‌మీక‌ర‌ణాల‌ను బ‌లోపేతం చేయ‌డంపై ప్ర‌ధానంగా దృష్టి సారించిన‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో పార్టీ పదవుల భర్తీలో వెనుకబడిన తరగతులు, మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన నాయకులకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. ఎన్నిక‌ల స‌న్నాహాల్లో భాగంగా బీజేపీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Also Read..

ఛత్రోన్ కీ గూంజ్ కాదు పైసే కీ గూంజ్‌.. రాహుల్ కార్య‌క్ర‌మం కోసం ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ. 35 వేలు

మోదీ సిల్వర్ జూబ్లీ వేళ.. దేశ‌వ్యాప్తంగా బీజేపీ సేవా పఖ్వాడా

గచ్చిబౌలిలో ఘోర ప్ర‌మాదం.. పేక‌మేడ‌లా కూలిన ఏడంతస్తుల భవనం

Advertisement

తాజావార్తలు

Advertisement