త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Journalists | జ‌ర్న‌లిస్టుల‌కు నిమ్స్‌లో మాస్ట‌ర్ హెల్త్ చెక‌ప్ శిబిరం ప్రారంభం

Journalists | సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్ స‌భ్యుల‌కు శుభవార్త‌. నిత్యం వార్త‌ల సేక‌ర‌ణ‌లో నిమ‌గ్న‌మై.. ఆరోగ్యాన్ని కూడా ప‌ట్టించుకోని ప్రెస్‌క్ల‌బ్ జ‌ర్న‌లిస్టు సోద‌రుల‌కు నిమ్స్‌లో మాస్ట‌ర్ హెల్త్ చెక‌ప్ ప్ర‌త్యేక శిబిరం ప్రారంభ‌మైంది.

S

Telangana | Published On Jul 24, 2026, 4.16 pm IST

Journalists | జ‌ర్న‌లిస్టుల‌కు నిమ్స్‌లో మాస్ట‌ర్ హెల్త్ చెక‌ప్ శిబిరం ప్రారంభం
Advertisement

Journalists | త్రినేత్ర‌.న్యూస్ : సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్ స‌భ్యుల‌కు శుభవార్త‌. నిత్యం వార్త‌ల సేక‌ర‌ణ‌లో నిమ‌గ్న‌మై.. ఆరోగ్యాన్ని కూడా ప‌ట్టించుకోని ప్రెస్‌క్ల‌బ్ జ‌ర్న‌లిస్టు సోద‌రుల‌కు నిమ్స్‌లో మాస్ట‌ర్ హెల్త్ చెక‌ప్ ప్ర‌త్యేక శిబిరం ప్రారంభ‌మైంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ ఆదేశాల మేర‌కు నిమ్స్ డైరెక్ట‌ర్ రాహుల్ దేవ‌రాజ్ ఆధ్వ‌ర్యంలో సీనియ‌ర్ ప్రొఫెసర్లు చంద్ర‌శేఖ‌ర్, ప‌రంజ్యోతి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్ట‌ర్ చ‌ర‌ణ్ రాజ్ క‌లిసి లాంఛనంగా ప్రారంభించారు.

జర్నలిస్టుల‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు ఈ మాస్టర్ హెల్త్ చెకప్ శిబిరం ఎంతగానో ఉపకరిస్తుందని ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. విజయకుమార్ రెడ్డి, రమేష్ వరికుప్పల పేర్కొన్నారు. తీవ్రమైన పని ఒత్తిడి వల్ల జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అలాంటి వారికి ఈ శిబిరం ఒక సువర్ణ అవకాశమని ప్రెస్ క్లబ్ కార్యవర్గం అభిప్రాయపడింది.

ఈ వైద్య శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఏ.రాజేష్, అరుణ అత్తలూరి, జాయింట్ సెక్రెటరీ చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారి రమేష్ వైట్ల, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎన్. శ్రీనివాస్ రెడ్డి, వనం నాగరాజు, అశోక్ దయ్యాల, రచన ముడుంబై, నిమ్స్ పీఆర్‌వో సత్యం గౌడ్, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డు ఉన్న సభ్యులందరికీ ఈ మాస్టర్ హెల్త్ చెకప్ చేయడం జరుగుతుందని నిమ్స్ వైద్యాధికారులు వెల్లడించారు. ప్రెస్ క్లబ్ నమోదు చేసుకున్న సభ్యులకు మాత్రమే ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని ప్రెస్ క్లబ్ కార్యవర్గం వెల్లడించింది.

Advertisement
Advertisement