త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Cabinet | ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు కేబినెట్ భేటీ

Telangana Cabinet | సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న గురువారం సాయంత్రం 4 గంట‌ల‌కు కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి మంత్రులు, ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు.

S

Telangana | Published On Nov 5, 2026, 9.51 am IST

Telangana Cabinet | ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు కేబినెట్ భేటీ
Advertisement

Telangana Cabinet | త్రినేత్ర న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న గురువారం సాయంత్రం 4 గంట‌ల‌కు కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి మంత్రులు, ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు. కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంది. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఆమోదించనున్నారు. అందుకు ఎస్టీ, ఎస్టీ కమిషన్ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. హైదరాబాద్‌ తరహాలో నిజామాబాద్, నల్గొండ, వరంగల్, కరీంనగర్‌లో అల్పాదాయ కుటుంబాలకు ఇందిరమ్మ టవర్ల నిర్మాణంపై కేబినెట్​లో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. హౌసింగ్ బోర్డు స్థలాల్లో జీ ప్లస్ 5 టవర్లు నిర్మించి, నియోజకవర్గానికి 480 మంది లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, అర్హతలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఇక 22ఏ పై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావంపై ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీ తొలి నివేదికను మంత్రివర్గం ముందుంచనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా శ్రీకారం చుట్టనున్న కొత్త పథకాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇందిరమ్మ కుటుంబ బీమా, మహిళకు కుట్టు మిషన్లు, చీరల పంపిణీ, చేయూత పెన్షన్లు వంటి అంశాలపై మార్గదర్శకాలు ఖరారు చేసే అవకాశం ఉంది.

మంత్రివర్గ సమావేశానికి ముందు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ అనధికార భేటీ జరగనుంది. డిసెంబరు 7,8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం, మంత్రులు సమాలోచన చేసి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లు, అతిథులకు ఆహ్వానాలు, రక్షా ఎక్స్‌పో, వంటి అంశాలపై సమీక్షించి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనుంది. ఈనెల 14న ఖాళీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అనధికార కేబినెట్‌ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement