CM Revanth Reddy | సదర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవం : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | సదర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సదర్ వేడుకలకు రూ.5 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక యాదవులను అన్ని విధాలుగా గౌరవిస్తున్నామని సీఎం తెలిపారు.
CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : సదర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సదర్ వేడుకలకు రూ.5 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక యాదవులను అన్ని విధాలుగా గౌరవిస్తున్నామని సీఎం తెలిపారు.
యాదవ సోదరుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సదర్ సమ్మేళనాన్ని తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సదర్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించామన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. గోల్కొండ కోట గతంలో కొల్లకొండ కోట అని గుర్తు చేశారు. గోల్కొండ కోట, కాకతీయ రాజవంశం కాలం నాటి నుంచి హైదరాబాద్ అభివృద్ధిలో యాదవ రాజులు, యాదవ సోదరుల కృషి మరవరానిదని కొనియాడారు. చదువు, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం దేశం నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరినీ యాదవ సోదరులు కలుపుకొని పోయారని అన్నారు.
కాలేజీ రోజుల నుంచే దీపావళి సమయంలో సదర్ వేడుకల వైభవాన్ని చూస్తున్నానని.. ఇది నగరానికి ఎంతో శోభనిస్తుందని కొనియాడారు. తేజస్వి యాదవ్, ధర్మేంద్ర యాదవ్, ఇతర నేతలకు కార్యక్రమం దిగ్విజయం చేసిన స్థానిక యాదవ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు.. కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలెర్ట్
- ●US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లకు మహర్దశ..?
- ●King 100 | కింగ్ 100లో టబు గ్లింప్స్
- ●IND Vs NZ ODI | కోహ్లీ విధ్వంసం.. కివీస్‌పై భారత్ ఘన విజయం
- ●Bandi Sanjay KTR Bouncer Row | ట్విట్టర్ టిల్లు మీది మేనేజ్మెంట్ కోటా.. మాది మెరిట్ కోటా..!
- ●Stock Markets | వరుస లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. రెండు నెలల గరిష్టానికి సూచీలు..

TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు.. కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలెర్ట్

US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లకు మహర్దశ..?

King 100 | కింగ్ 100లో టబు గ్లింప్స్

IND Vs NZ ODI | కోహ్లీ విధ్వంసం.. కివీస్‌పై భారత్ ఘన విజయం





