త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PURE Energy | ఫ్యూర్ ఎన‌ర్జీ ఈవీ ప‌రిశ్ర‌మ‌లో అగ్నిప్ర‌మాదం

PURE Energy | సంగారెడ్డి జిల్లాలోని కంది స‌మీపంలోని పారిశ్రామిక కారిడార్‌లో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఫ్యూర్ ఎన‌ర్జీ( PURE Energy )ఈవీ ప‌రిశ్ర‌మ‌లో అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి.

S

Telangana | Published On Nov 5, 2026, 9.58 am IST

PURE Energy | ఫ్యూర్ ఎన‌ర్జీ ఈవీ ప‌రిశ్ర‌మ‌లో అగ్నిప్ర‌మాదం
Advertisement

PURE Energy | త్రినేత్ర న్యూస్ : సంగారెడ్డి జిల్లాలోని కంది స‌మీపంలోని పారిశ్రామిక కారిడార్‌లో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఫ్యూర్ ఎన‌ర్జీ( PURE Energy )ఈవీ ప‌రిశ్ర‌మ‌లో అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. గురువారం తెల్ల‌వారుజామున చోటు చేసుకున్న ఈ అగ్నిప్ర‌మాదంలో ఎల‌క్ట్రిక్ స్కూటీలు ద‌గ్ధ‌మ‌య్యాయి.

స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. ప‌రిశ్ర‌మ‌లోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేద‌ని, అంద‌రూ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డార‌ని పోలీసులు తెలిపారు. దీంతో కార్మికుల కుటుంబ స‌భ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈవీ పరిశ్రమలో భారీగా ఆస్తినష్టం జరిగిందని ఫైర్​ సర్వీసెస్​ సిబ్బంది తెలిపారు.

 

Advertisement
Advertisement