Gandipeta conduit | 105 ఏళ్ల పురాతన గండిపేట కాండ్యూట్లో భారీ లీకేజీలకు అడ్డుకట్ట
Gandipeta conduit | హైదరాబాద్ నగరానికి ఉస్మాన్‌సాగర్ (గండిపేట) జలాశయం నుంచి ముడినీటిని సరఫరా చేసే ప్రధాన కాండ్యూట్లో భారీ లీకేజీలను అరికట్టేందుకు చేపట్టిన మరమ్మతు పనులను జలమండలి విజయవంతంగా పూర్తి చేసింది.
షెడ్యూల్ కంటే 6 గంటల ముందుగానే మరమ్మతు పనులు పూర్తి
8 కీలక ప్రాంతాల్లో 90 శాతానికి పైగా లీకేజీల నియంత్రణ
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు
ప్రభావిత ప్రాంతాలకు దశలవారీగా తాగునీటి సరఫరా పునరుద్ధరణ
Gandipeta conduit | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ నగరానికి ఉస్మాన్‌సాగర్ (గండిపేట) జలాశయం నుంచి ముడినీటిని సరఫరా చేసే ప్రధాన కాండ్యూట్లో భారీ లీకేజీలను అరికట్టేందుకు చేపట్టిన మరమ్మతు పనులను జలమండలి విజయవంతంగా పూర్తి చేసింది. నిర్ణీత గడువు కంటే 6 గంటల ముందుగానే పనులు పూర్తి చేసి నీటి సరఫరా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించింది.
సుమారు 105 ఏళ్లకు పైగా నగరానికి సేవలందిస్తున్న ఈ పురాతన రాతి నిర్మాణ కాండ్యూట్లో కాలక్రమేణా రాతి కట్టడాలు, వాటి మధ్య జాయింట్లు దెబ్బతినడంతో పలుచోట్ల భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. వీటిని పూర్తిస్థాయిలో నివారించేందుకు కాండ్యూట్ పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉండగా, అందుకు కొన్ని నెలల సమయం అవసరమవుతుంది.
అయితే, రాబోయే ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి లభ్యతపై సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, నీటి సరఫరాలో నష్టాలను తగ్గించేందుకు జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు కాండ్యూట్లో లీకేజీలు అధికంగా ఉన్న 8 కీలక ప్రాంతాలను గుర్తించారు. వాటి మరమ్మతుల కోసం నవంబర్ 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 36 గంటల పాటు షట్‌డౌన్ చేపట్టారు.
సబ్జా కాలనీ, జానకీ నగర్, టోలిచౌకి, మణికొండ, గండిపేట ప్రాంతాల్లో చేపట్టిన మరమ్మతు పనులను అధికారులు, సిబ్బంది సమన్వయంతో వేగంగా పూర్తి చేశారు. పరిమిత సమయంలోనే గుర్తించిన ప్రాంతాల్లో 90 శాతానికి పైగా దీర్ఘకాలిక లీకేజీలను అరికట్టి, నీటి వృథాను గణనీయంగా తగ్గించేలా చర్యలు తీసుకున్నారు.
మరమ్మతు పనులు పూర్తయిన నేపథ్యంలో డివిజన్ XIII, XIV, XV, XVII పరిధిలోని ప్రభావిత ప్రాంతాలకు పంపింగ్, నీటి పంపిణీని దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. ఈ సమయంలో తాగునీటి సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని అర్థం చేసుకుని సహకరించిన నగర ప్రజలకు జలమండలి కృతజ్ఞతలు తెలిపింది.
తాజావార్తలు
- ●Mirnalini Ravi | ప్రియుడిని పెళ్లిచేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్ - మెహందీ వేడుకల ఫొటోలు వైరల్
- ●School Bus | డ్రైవర్‌కు ఫిట్స్.. 40 మంది స్కూల్ విద్యార్థులు సురక్షితం
- ●U19 Asia Cup 2026 | ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ సంచలన విజయం
- ●Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్గా - "కాంత" కోసం ఆడిషన్ ఇచ్చా కానీ - సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ●Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!
- ●BM Sandeep | తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జిగా బీఎం సందీప్

Mirnalini Ravi | ప్రియుడిని పెళ్లిచేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్ - మెహందీ వేడుకల ఫొటోలు వైరల్

School Bus | డ్రైవర్‌కు ఫిట్స్.. 40 మంది స్కూల్ విద్యార్థులు సురక్షితం

U19 Asia Cup 2026 | ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ సంచలన విజయం

Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్గా - "కాంత" కోసం ఆడిషన్ ఇచ్చా కానీ - సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్






