Telangana Budget 2026-27 at a Glance | తెలంగాణ బడ్జెట్ 2026-27 ‘ఎట్ ఏ గ్లాన్స్’ : రాబడులు, వ్యయాల పూర్తి లెక్కలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ అంచనాలను (Budget at a Glance) విడుదల చేసింది. మొత్తం రూ. 3.24 లక్షల కోట్ల బడ్జెట్‌లో ప్రభుత్వానికి రాబోయే ఆదాయం ఎంత? చేయబోయే ఖర్చు ఎంత? ద్రవ్య లోటు, రెవెన్యూ మిగులు వివరాలు ఇవే.
Telangana Budget 2026-27 at a Glance | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అంచనాలకు సంబంధించిన సమగ్ర నివేదికను (Budget at a Glance) విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని, వివిధ రూపాల్లో పెట్టే ఖర్చులను ఈ పత్రాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. బడ్జెట్ పత్రాల ప్రకారం ఆర్థిక లెక్కల పూర్తి వివరాలు (రూ. కోట్లలో) ఇలా ఉన్నాయి.
మొత్తం బడ్జెట్ అంచనాలు
మొత్తం రాబడులు (Total Receipts): రూ. 3,24,134.00 కోట్లు.
మొత్తం వ్యయం (Total Expenditure): రూ. 3,24,134.00 కోట్లు.
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులతో (Ways and Means Advances) కలుపుకొని బడ్జెట్ మొత్తం విలువ రూ. 3,24,234.00 కోట్లుగా అంచనా వేశారు.
ప్రభుత్వ రాబడులు (Receipts) ఎక్కడి నుంచి వస్తున్నాయంటే?
మొత్తం రాబడులను రెవెన్యూ, క్యాపిటల్ రాబడులుగా విభజించారు.
రెవెన్యూ రాబడులు (Revenue Receipts): రూ.2,41,263.58 కోట్లు.
రాష్ట్ర పన్నుల ఆదాయం (Tax Revenue): రూ.1,48,185.75 కోట్లు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా (State Share in Central Taxes): రూ.33,181.64 కోట్లు.
పన్నేతర ఆదాయం (Non Tax Revenue): రూ.35,730.20 కోట్లు.
గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ (Grants-in-aid): రూ.24,166.00 కోట్లు.
క్యాపిటల్ రాబడులు (Capital Receipts): రూ.82,870.42 కోట్లు.
ఇందులో ప్రధానంగా బహిరంగ మార్కెట్ రుణాలు (Open Market Loans) రూ. 73,383.60 కోట్లుగా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకునే రుణాలు (Loans from GOI): రూ.5,500.00 కోట్లు
ప్రభుత్వ వ్యయం (Expenditure) ఎలా ఉందంటే?
సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం చేసే వ్యయాన్ని కూడా రెండుగా విభజించారు.
రెవెన్యూ వ్యయం (Revenue Expenditure): రూ.2,34,405.82 కోట్లు. ఇందులో వడ్డీల చెల్లింపులకే (Interest Payments) ఏకంగా రూ.21,304.39 కోట్లు ఖర్చవుతోంది.
మూలధన వ్యయం (Capital Expenditure): రూ.47,267.28 కోట్లు.
రుణాలు, అడ్వాన్సులు (Loans and Advances): రూ.19,536.01 కోట్లు.
పబ్లిక్ డెబ్ట్ చెల్లింపులు (Repayment Public Debt): రూ.19,785.98 కోట్లు.
మిగులు, లోటు వివరాలు (Surplus and Deficits)
ఆర్థిక నిపుణులు, సంస్థలు అత్యంత కీలకంగా గమనించే లోటు లెక్కలు ఈ విధంగా ఉన్నాయి.
రెవెన్యూ మిగులు (Revenue Surplus): రూ.6,857.76 కోట్లు. (అంటే రెవెన్యూ రాబడులు.. రెవెన్యూ వ్యయం కంటే అధికంగా ఉన్నాయి).
ద్రవ్య లోటు (Fiscal Deficit): రూ.58,458.71 కోట్లు.
ప్రాథమిక లోటు (Primary Deficit): రూ.37,154.32 కోట్లు
మొత్తంగా చూసుకుంటే, ప్రభుత్వం పెద్ద ఎత్తున పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటూనే, సంక్షేమం, మూలధన ప్రాజెక్టుల కోసం గణనీయమైన స్థాయిలో బహిరంగ మార్కెట్ రుణాలపై ఆధారపడుతోందని ఈ 'బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్' పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telangana Budget 2026-27 | తెలంగాణ బడ్జెట్ 2026-27: వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
మార్చి 20, 2026

Naxalism | నక్సలిజం నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానం దేశానికే ఆదర్శం : భట్టి విక్రమార్క
మార్చి 20, 2026

Telangana Budget 2026-27 | అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక ‘టి-ఫైబర్’ ఇంటర్నెట్.. గ్రిడ్ (GRID) తో నలువైపులా ఐటీ
మార్చి 20, 2026
తాజావార్తలు
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
- ●Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?

Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!



