KTR and Harish Rao Arrest | ఎర్రవల్లి వద్ద హైటెన్షన్: ‘ఎవడ్రా నువ్వు’ అంటూ పోలీసుల జులుం.. కేటీఆర్, హరీష్ రావుల అరెస్ట్
ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వద్ద హైటెన్షన్. కాంగ్రెస్ నేతల దాడి యత్నంపై మండిపడిన కేటీఆర్, హరీష్ రావుల పాదయాత్ర, అరెస్ట్. అసలేం జరిగిందంటే?
- కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడికి యత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతల ఆందోళన
- ఎర్రవల్లికి మద్దతుగా వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావులను అడ్డుకున్న పోలీసులు
- పోలీసుల దురుసు ప్రవర్తనపై మండిపడుతూ బొల్లారం నుంచి కాలి నడకన బయలుదేరిన నేతలు
- హాకింపేట్ వద్ద ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి బోయిన్‌పల్లి పీఎస్‌కు తరలించిన పోలీసులు
KTR and Harish Rao Arrest | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ నివాసం ఉన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు బీఆర్ఎస్ అగ్రనేతలు వెళ్తుండగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఇంటిపై దాడికి కాంగ్రెస్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, గూండాలను ఉసిగొల్పుతోందని ఆరోపిస్తూ మద్దతుగా బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు.
పోలీసుల జులుం.. పాదయాత్రగా ఎమ్మెల్యేలు
బొల్లారం వద్ద బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు దురుసుగా ప్రవర్తించారని గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. కనీస గౌరవం లేకుండా ప్రజాప్రతినిధులను 'ఎవడ్రా నువ్వు' అంటూ పోలీసులు జులుం ప్రదర్శించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పోలీసుల నిర్బంధాన్ని బద్దలుకొట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవల్లి వైపు పాదయాత్రగా ముందుకు కదిలారు. అధికార పార్టీ దాష్టీకాలకు పోలీసుల వత్తాసు పలకడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్కార్ట్ ఇచ్చి మరీ పంపుతారా?
ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. "ముందు కాంగ్రెస్ గూండాలను ఆపండి.. అప్పుడు మేము ఆగుతాం. మీరు నిజంగానే వాళ్లను ఆపితే కేసీఆర్ ఇంటిదాకా ఎలా చేరుకున్నారు? మీ పోలీసులే స్వయంగా ఎస్కార్ట్ (Escort) ఇచ్చి మరీ దాడికి పంపించారు," అని కేటీఆర్ మండిపడ్డారు. మరోవైపు హరీష్ రావు స్పందిస్తూ.. "మా నాయకుడిపై దాడి జరుగుతుంటే మేము ఇంట్లో కూర్చోవాలా? సీఎం రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలు హన్మంతరావు, వీరేశం తదితరులకు, గూండాలకు ఎస్కార్ట్ ఇచ్చి పంపడం మర్యాదనా?" అని నిలదీశారు.
హాకింపేట్ వద్ద అరెస్ట్..
తీవ్ర ఉద్రిక్తతల నడుమ కాలి నడకన ఎర్రవల్లికి బయలుదేరిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను హాకింపేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హకీంపేట్ వద్ద మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలను మేడ్చల్ సీపీ సుమతి అరెస్ట్ చేసి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్‌ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు బోయినపల్లి పీఎస్‌కు తరలించారు. హకీంపేట్ దాటిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు సహా పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులందరినీ పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎవడ్రా నువ్వు అంటూ పోలీసుల జులుం
కేసీఆర్ నివాసం వద్దకు వెళ్తున్న కేటీఆర్, జగదీష్ రెడ్డి,హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులను అడ్డుకొని ఎవడ్రా నువ్వు అంటూ పోలీసుల జులుం pic.twitter.com/zwQssn56jh
— Telangana First (@TelanganaFirst_) September 8, 2026
కాంగ్రెస్ గూండాలను ఆపండి.. మేము ఆగుతాం
మీరు నిజంగానే కాంగ్రెస్ గూండాలని ఆపితే.. కేసీఆర్ ఇంటిదాకా వాళ్లు ఎలా చేరుకున్నారు
మీ పోలీసులే ఎస్కార్ట్ ఇచ్చి మరీ.. కేసీఆర్ ఇంటిపై దాడికి కాంగ్రెస్ గూండాల్ని పంపించారు
- కేటీఆర్ pic.twitter.com/is1QnFscPz
— PulseNewsBreaking (@pulsenewsbreak) September 8, 2026
ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి కాలి నడకన వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు
అరెస్ట్ చేసి బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు https://t.co/HzHD1fcAKH pic.twitter.com/MN3O6iB3Ky
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026
హాకింపెట్ దగ్గర ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు… https://t.co/hCVBCe1HLG pic.twitter.com/U404sl6SOY
— Sarita Avula (@SaritaAvula) September 8, 2026
మా నాయకుడిపై దాడి జరుగుతుంటే.. మేము ఇంట్లో కూర్చోవాలా?
కాంగ్రెస్ గూండాల్ని పంపించి.. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు?
రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలు, గూండాలను ఎస్కార్ట్ ఇచ్చి కేసీఆర్ ఇంటికి పంపడం మర్యాదనా?
హన్మంతరావు, వీరేశం, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడిదాకా ఎలా వెళ్లారు?
— PulseNewsBreaking (@pulsenewsbreak) September 8, 2026
KTR arrest https://t.co/0LwiWDqB7j pic.twitter.com/U2Rhyfpdfn
— Sarita Avula (@SaritaAvula) September 8, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | వలువలు విప్పుతున్నానన్న రేవంత్‌రెడ్డి.. విలువల గురించి మాట్లాడుతున్నడు : కేటీఆర్
సెప్టెంబర్ 7, 2026

సెప్టెంబర్ 7 ( రేపటి ) నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. సభ ముందుకు కీలక బిల్లులు, తీర్మానాలు
సెప్టెంబర్ 6, 2026

Minister Seethakka | ‘పచ్చ కాంగ్రెస్’ అనడం హాస్యాస్పదం
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Minister Vakiti Srihari CPR | అసెంబ్లీలో విషాదం: కుప్పకూలిన అధికారికి మంత్రి సీపీఆర్.. అయినా దక్కని ప్రాణం
- ●RS Praveen Kumar | ఎమ్మెల్యే శంకర్, రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయండి
- ●PM Modi | 10 ఏళ్లలో 50 వేల మరుగుదొడ్లను కూడా నిర్మించలేకపోయారు : ప్రధాని మోదీ
- ●Bullet Train | వచ్చే ఏడాది పట్టాలపైకి బుల్లెట్ రైలు
- ●KCR Erravalli Farmhouse Tension | కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: ఎర్రవల్లిలో 'వెయ్యి డప్పుల' నిరసన.. సెక్షన్ 144 విధింపు
- ●Canada | కెనడా ఎదురుదెబ్బ.. అమెరికా ఉత్పత్తులపై భారీ టారిఫ్‌లు..

Minister Vakiti Srihari CPR | అసెంబ్లీలో విషాదం: కుప్పకూలిన అధికారికి మంత్రి సీపీఆర్.. అయినా దక్కని ప్రాణం

RS Praveen Kumar | ఎమ్మెల్యే శంకర్, రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయండి

PM Modi | 10 ఏళ్లలో 50 వేల మరుగుదొడ్లను కూడా నిర్మించలేకపోయారు : ప్రధాని మోదీ

Bullet Train | వచ్చే ఏడాది పట్టాలపైకి బుల్లెట్ రైలు



