త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ముడి చ‌మురు ధ‌ర‌ల మంట‌.. భారీ న‌ష్టాల్లో ముగిసిన సూచీలు..

Stock Markets | దేశీయ ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు మంగ‌ళ‌వారం భారీ న‌ష్టాల్లో ముగిశాయి. ప‌శ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డం మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణ‌మైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 555.23 పాయింట్ల మేర త‌గ్గి 75,577 వ‌ద్ద ముగియ‌గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 144.05 పాయింట్లు త‌గ్గి 23,635 వ‌ద్ద నిలిచింది.

S

Business | Published On Sep 8, 2026, 4.06 pm IST

Stock Markets | ముడి చ‌మురు ధ‌ర‌ల మంట‌.. భారీ న‌ష్టాల్లో ముగిసిన సూచీలు..
Advertisement

Stock Markets | దేశీయ ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు మంగ‌ళ‌వారం భారీ న‌ష్టాల్లో ముగిశాయి. ప‌శ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డం మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణ‌మైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 555.23 పాయింట్ల మేర త‌గ్గి 75,577 వ‌ద్ద ముగియ‌గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 144.05 పాయింట్లు త‌గ్గి 23,635 వ‌ద్ద నిలిచింది. మంగ‌ళ‌వారం సెష‌న్‌లో క్యాపిట‌ల్ గూడ్స్ రంగానికి చెందిన షేర్లు ఎక్కువ‌గా లాభ‌ప‌డ‌గా, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీస్ కంపెనీల షేర్లు ప‌త‌న‌మ‌య్యాయి. హెల్త్‌కేర్‌, స‌ర్వీసెస్‌, ఎఫ్ఎంసీజీ, క‌న్‌జ్యూమర్ స‌ర్వీసెస్ రంగాల్లోనూ లాభాలు చోటు చేసుకున్నాయి. ఇక క‌న్‌స్ట్ర‌క్ష‌న్ మెటీరియ‌ల్స్‌, టెలిక‌మ్యూనికేష‌న్‌, రియాల్టీ, క‌న్‌జ్యూమ‌ర్ డ్యూర‌బుల్స్‌, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల షేర్లు న‌ష్టాల‌ను చ‌విచూశాయి.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌డం పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో వారిపై అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. ఉద‌యం సెష‌న్ ప్రారంభం నుంచే సూచీలు తీవ్ర అస్థిర‌త‌తో క‌దిలాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.99 శాతానికి పైగా ఎగ‌సి బ్యారెల్‌కు 96 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.14 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 94 డాల‌ర్ల‌కు చేరింది. ఫారెక్స్ మార్కెట్‌లో మ‌రోమారు భార‌త రూపాయి బ‌ల‌హీన‌త‌ను ప్ర‌ద‌ర్శించింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 94.81 వ‌ద్ద ఉన్న రూపాయి ఈ సెష‌న్‌లో 0.36 శాతం మేర న‌ష్ట‌పోయింది.

నిఫ్టీ50 కీల‌క మ‌ద్ద‌తు స్థాయికి..

రంగాల‌వారీగా చూస్తే నిఫ్టీ మీడియా 1.36 శాతం మేర పెరిగి అత్య‌ధిక లాభాలు సాధించిన రంగంగా నిలిచింది. త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా నిఫ్టీ ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఎన‌ర్జీ, ఆటో షేర్లు నిలిచాయి. ఇక నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్‌, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీస్‌, నిఫ్టీ బ్యాంక్‌, ఐటీ రంగాల‌కు చెందిన షేర్లు భారీ న‌ష్టాల‌ను న‌మోదు చేశాయి. నిఫ్టీ50 సూచీలో భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ షేర్ ధ‌ర అత్య‌ధికంగా 1.25 శాతం మేర పెర‌గ్గా, త‌రువాతి స్థానాల్లో ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌, కోల్ ఇండియా, హిందుస్థాన్ యూనిలివ‌ర్‌, బ‌జాజ్ ఆటో షేర్లు నిలిచాయి. అలాగే ఎస్‌బీఐ లైఫ్ షేర్ అత్య‌ధికంగా 2.05 శాతం మేర ప‌త‌న‌మ‌వ్వ‌గా, త‌రువాతి స్థానాల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిల‌య‌న్స్ నిలిచాయి. అయితే ప‌శ్చిమ ఆసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌ను గ‌మ‌నిస్తున్న పెట్టుబ‌డిదారులు రిస్క్ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని మార్కెట్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. కానీ నిఫ్టీ50తోపాటు ఇత‌ర సూచీలు కీల‌క మ‌ద్ద‌తు స్థాయిల‌కు కాస్త దూరంలో ఉన్నందున మ‌ళ్లీ మార్కెట్ పెరిగే చాన్స్ కోసం వారు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
Advertisement