త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi buildings | ఢిల్లీలో 38% భ‌వ‌నాలు రిస్క్‌లోనే.. భూకంపం వ‌స్తే అంతే సంగ‌తులు

Delhi buildings | పీజీ భవనం కుప్పకూలిపోవ‌డంతో.. ఢిల్లీ న‌గ‌రంలో భ‌వ‌నాల (Delhi buildings) భ‌ద్ర‌త‌పై తీవ్ర‌మైన ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఉన్న సుమారు 38 శాతం భవనాలు ప్ర‌మాదం అంచున ఉన్న‌ట్లు తాజా అధ్య‌య‌నంలో తేలింది. 5.0 తీవ్ర‌త‌తో భూకంపం (earthquake) సంభ‌విస్తే అవి కుప్ప‌కూలే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని ఈ అధ్య‌య‌నం అంచ‌నా వేసింది.

D

National | Published On Sep 8, 2026, 3.50 pm IST

Delhi buildings | ఢిల్లీలో 38% భ‌వ‌నాలు రిస్క్‌లోనే.. భూకంపం వ‌స్తే అంతే సంగ‌తులు
Advertisement

Delhi buildings | త్రినేత్ర‌.న్యూస్ : ఢిల్లీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్యానికేతన్‌లో 4 అంతస్తుల పీజీ భవనం కుప్పకూలిపోయిన విష‌యం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో జరిగిన ఈ ఆకస్మిక ఘటనలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది భ‌వ‌న శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘ‌ట‌న‌తో రాజ‌ధాని న‌గ‌రంలో భ‌వ‌నాల (Delhi buildings) భ‌ద్ర‌త‌పై తీవ్ర‌మైన ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

ముఖ్యంగా భూకంపం (earthquake) వంటి ప్ర‌కృతి విప‌త్తుల సమ‌యంలో భ‌వ‌నాల ప‌రిస్థితిపై ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ నివేదిక‌ షాకింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో ఉన్న సుమారు 38 శాతం భవనాలు ప్ర‌మాదం అంచున ఉన్న‌ట్లు తేలింది. 5.0 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌విస్తే అవి కుప్ప‌కూలే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని ఈ అధ్య‌య‌నం అంచ‌నా వేసింది.

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (National Center for Seismology) శాస్త్రవేత్తలు రజత్ పస్రిచా, కపిల్ మోహన్, ఓ.పి. మిశ్రా నిర్వహించిన అధ్య‌య‌నంలో ఈ షాకింగ్ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. శాస్త్రవేత్తలు 6.0 తీవ్రతతో భూకంపం వస్తే జరిగే నష్టాన్ని ప్రధానంగా విశ్లేషించారు. రాజ‌ధాని పరిధిలోని సుమారు 89 లక్షల భవనాల్లో 38 శాతం (33 ల‌క్ష‌ల‌కు పైగా) ఫాల్ట్ లైన్ జోన్ పరిధిలో ఉన్నట్లు తేలింది. ఓ మోస్తరు భూకంపాలను కూడా అవి తట్టుకోలేవ‌న్న‌మాట‌. ఢిల్లీలోని సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, క్రియాశీల‌ ఫాల్ట్‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతోపాటూ విప‌రీత‌మైన జ‌నాభా, ఇరుకైన వీధులు, పాత కట్టడాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు వంటివే ముప్పుకు ప్ర‌ధాన‌ కారకాలుగా తేల్చారు. ఈ ప‌రిస్థితులే విప‌త్తులో ప్రాణ, ఆస్తి నష్టాన్ని భారీగా పెంచుతాయని హెచ్చ‌రిస్తున్నారు.

హై-రిస్క్ జోన్ IVలో ఢిల్లీ..

భౌగోళిక ప్రాముఖ్యత పరంగా భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన భూకంప ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ నగరం ఒకటి. ఇది దేశంలోనే తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉన్న హై-రిస్క్ జోన్ IV పరిధిలో ఉంటుంది. ఢిల్లీ పరిసరాల్లో సోహ్నా, ఢిల్లీ-సర్గాధా, మహేంద్రగఢ్-డెహ్రాడూన్ వంటి క్రియాశీలక భూకంప ఫాల్ట్ లైన్లు ఉన్నాయి. స్థానిక పలకల నుంచి పుట్టుకొచ్చే భూకంపాలే కాకుండా.. రాజ‌ధాని న‌గ‌రం హిమాలయ పర్వత శ్రేణుల‌కు స‌మీపంలో ఉండ‌టంతో అక్క‌డ సంభ‌వించే భూకంపాల ప్రభావం కూడా ఢిల్లీపై ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నేల స్వభావం కూడా భూప్రకంపనల తీవ్రతను పెంచేలా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Also Read..

10 ఏళ్ల‌లో 50 వేల మ‌రుగుదొడ్ల‌ను కూడా నిర్మించ‌లేక‌పోయారు : ప్ర‌ధాని మోదీ

ఐసీఐసీఐ లాంబార్డ్‌కు రూ.1 కోటి జరిమానా.. అసలు కారణం ఇదే..

రవితేజ మేనల్లుడి ‘మరెమ్మ’కు ‘ఏ’ సర్టిఫికెట్‌.. విడుదల ఎప్పుడంటే?

Advertisement
Advertisement