Teenmar Mallanna | ఆర్థిక ఇబ్బందులతో ఏ విద్యార్ధీ చదువును మధ్యలోనే ఆపేయకూడదు: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Teenmar Mallanna | ఆడబిడ్డల ఉన్నత చదువులు ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోకూడదని ఎమ్మెల్సీ, బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) అన్నారు. ప్రతి పేద బిడ్డకు నాణ్యమైన ఉచిత విద్య అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.
Teenmar Mallanna | త్రినేత్ర న్యూస్: ఆడబిడ్డల ఉన్నత చదువులు ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోకూడదని ఎమ్మెల్సీ, బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) అన్నారు. ప్రతి పేద బిడ్డకు నాణ్యమైన ఉచిత విద్య అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. బీసీ రాజ్యాధికార యాత్రలో (Rajyadhikara Yathra) భాగంగా నారాయణపేట జిల్లాలోని కోస్గి మండలం కడంపల్లికి ఎమ్మెల్సీ మల్లన్న చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కావలి శ్రీనివాస్, మంగమ్మ దంపతుల చిన్న కూతురు అన్నపూర్ణ ఉన్నత చదువులకు చేయూత అందించారు. ఇంటర్ బైపీసీలో 948 మార్కులు సాధించిన అన్నపూర్ణ.. బీఎస్సీ ఎంఎల్టీ కోర్సు చేయాలనుకుంది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పాదయాత్ర సందర్భంగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. అన్నపూర్ణ నివాసానికి వెళ్లి ఆమె ఉన్నత చదువుల కోసం రూ.లక్ష ఆర్థిక సహాయం (Financial Assistance) అందించారు. వెంటనే కాలేజీలో చేరాలని సూచించారు. అవసరమైతే మరింత సహాయం చేస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య ఉచితంగా (Free Education) అందుబాటులోకి రావాలన్నదే తమ పార్టీ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆర్థిక పరిస్థితులు బాగోలేవనే కారణంతో ఏ విద్యార్థి కూడా చదువును మధ్యలో ఆపాల్సిన పరిస్థితి ఉండకూడదని చెప్పారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండే విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడితే పేద కుటుంబాల పిల్లలకు ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన ఉచిత విద్య అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సంబంధిత వార్తలు

Teenmar Mallanna BC Rajyadhikara Yatra | కొడంగల్లో అడుగుపెడతా.. రేవంత్ రెడ్డి భరతం పడతా
సెప్టెంబర్ 23, 2026

Teenmar Mallanna | స్కిల్ యూనివర్సిటీ వీసీకి పీహెచ్డీ పట్టా కూడా లేదు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
సెప్టెంబర్ 11, 2026

Teenmar Mallanna | మా దళిత బిడ్డ కూర్చుంటే కళ్లు మండుతున్నయ్: తీన్మార్ మల్లన్న
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Microsoft Copilot | మైక్రోసాఫ్ట్ కోపైలట్లో భారీ మార్పులు.. ఇక ఏఐతోనే అన్ని పనులు..
- ●Supreme Court | నిర్భయ ఘటనను గుర్తు చేస్తోంది.. ఢిల్లీలో వరుస అత్యాచార ఘటనలపై సుప్రీం ఆందోళన
- ●Road Accident | నస్పూర్లో లారీ, ఆటో ఢీ.. ముగ్గురు మహిళలు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం!
- ●IPO | ఐపీఓల జాతర.. ఈ వారం 20 కొత్త ఇష్యూలు..
- ●Ponnam Prabhakar | మహిళల ఆర్థిక సాధికారతే.. సమాజ అభివృద్ధికి పునాది: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Ujjain Mosque Removal | ఉజ్జయినిలో ఘర్షణ.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు

Microsoft Copilot | మైక్రోసాఫ్ట్ కోపైలట్లో భారీ మార్పులు.. ఇక ఏఐతోనే అన్ని పనులు..

Supreme Court | నిర్భయ ఘటనను గుర్తు చేస్తోంది.. ఢిల్లీలో వరుస అత్యాచార ఘటనలపై సుప్రీం ఆందోళన

Road Accident | నస్పూర్లో లారీ, ఆటో ఢీ.. ముగ్గురు మహిళలు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం!

IPO | ఐపీఓల జాతర.. ఈ వారం 20 కొత్త ఇష్యూలు..



