Girls Hostel | నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం..
Girls Hostel | నారాయణపేట జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ (GMC) గర్ల్స్ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో హాస్టల్‌లోని (Girls Hostel) మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Girls Hostel | త్రినేత్ర న్యూస్: నారాయణపేట జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ (GMC) గర్ల్స్ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో హాస్టల్‌లోని (Girls Hostel) మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు బిల్డింగ్ మొత్తానికి వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎంబీబీఎస్ ((MBBS)) మూడో సంవత్సరం చదువుతున్న 20 మందికి పైగా విద్యార్థినుల పుస్తకాలు, దుస్తులు ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి. కాగా, విద్యార్థినులకు ఎలాంటి ప్రాణాపాయం జరగనప్పటికీ, భవనంలో వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడంతో దట్టమైన పొగ అలుముకుని కొందరు విద్యార్థినులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (Short Circuit) వల్లే మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. కాగా, నారాయణపేట (Narayanpet) మెడికల్ కాలేజీ యాజమాన్యం విద్యార్థినుల వసతి కోసం ఒక ప్రైవేట్ భవనాన్ని కిరాయికి తీసుకున్నది. అయితే హాస్టల్‌లో మంటలను ఆర్పే ప్రాథమిక పరికరాలు (Fire extinguishers) కూడా లేవని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు.
తాజావార్తలు
- ●Varsha Turkar | స్నేహితుడితో కలసి బయటకు వెళ్లింది.. అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది..
- ●JNTU | హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి.. జేఎన్టీయూలో విద్యార్థి ఆత్మహత్య
- ●Jatayu | సీతమ్మను ఎత్తుకెళ్తుండగా.. రావణుడితో పోరాడి జటాయువు ప్రాణాలు విడిచింది ఇక్కడే..!
- ●TG TET | నేటి నుంచి టీజీ టెట్ దరఖాస్తులు షురూ..
- ●Horoscope | నవంబర్ 16 సోమవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
- ●Symptoms Before Death | మరణానికి 24 గంటల ముందు మనిషిలో కనిపించే 3 ప్రధాన సంకేతాలు ఇవే..!

Varsha Turkar | స్నేహితుడితో కలసి బయటకు వెళ్లింది.. అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది..

JNTU | హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి.. జేఎన్టీయూలో విద్యార్థి ఆత్మహత్య

Jatayu | సీతమ్మను ఎత్తుకెళ్తుండగా.. రావణుడితో పోరాడి జటాయువు ప్రాణాలు విడిచింది ఇక్కడే..!

TG TET | నేటి నుంచి టీజీ టెట్ దరఖాస్తులు షురూ..






