త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Venkat Reddy | హ‌లో! ఇడ్లీ తిన్న‌వా.. మమ్మి డాడీ అంటున్న‌వా

Komatireddy Venkat Reddy | హ‌లో.. ఏమైతుంది.. నొప్ప‌యితుందా.. ఏడ్వ‌కేడ్వ‌క్ అంటూ ఆ చిన్నారి క‌న్నీళ్లు తుడిచి ఆత్మీయను చాటుకున్నారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి.

S

Telangana | Published On Oct 10, 2026, 5.57 pm IST

Komatireddy Venkat Reddy | హ‌లో! ఇడ్లీ తిన్న‌వా.. మమ్మి డాడీ అంటున్న‌వా
Advertisement
  • స్పీచ్ థెర‌పీ బాధిత చిన్నారితో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆత్మీయ ప‌ల‌క‌రింపు

Komatireddy Venkat Reddy | త్రినేత్ర న్యూస్‌: హ‌లో.. ఏమైతుంది.. నొప్ప‌యితుందా.. ఏడ్వ‌కేడ్వ‌క్ అంటూ ఆ చిన్నారి క‌న్నీళ్లు తుడిచి ఆత్మీయను చాటుకున్నారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి. ఇడ్లీ తిన్న‌వా.. మమ్మి డాడీ అంటున్న‌వా అంటూ ఆప్యాయంగా ప‌ల‌క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. మాట‌లకు నోచుకోని ఆ బాధిత‌ చిన్నారి ప‌ట్ల మాన‌వ‌త్వం చాటి మ‌న‌సులు గెలుచుకున్నారు. ఆ వివ‌రాలేంటో ఆయ‌న మాటల్లోనే..

ఉప్ప‌ల్‌కు చెందిన ఓ చిన్నారికి మాట‌లు రాక‌పోవ‌డంతో ఆ తల్లిదండ్రుల కళ్లలోని ఆవేదన న‌న్ను తీవ్రంగా క‌లచివేసింది. ఆ చిన్నారి మాట్లాడగలదనే ఆశ‌తో ముందుకు న‌డిచాను. స్పీచ్ థెర‌పీకి అయ్యే ఖ‌ర్చును భ‌రిస్తూ కిమ్స్ ఆస్ప‌త్రిలో చేర్పించాను. ఈరోజు కిమ్స్ ఆసుపత్రిలో పాపకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయింది. స్వయంగా వెళ్లి మాట్లాడాను. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాను.

ఆ గొంతులో మాట‌లు ప‌లికిస్తా..

వైద్యుల పర్యవేక్షణ, స్పీచ్ థెరపీతో ఆ చిన్నారి త్వరలోనే మాట్లాడుతుందని వైద్యులు చెప్పారు. అదనంగా మ‌రో రూ.2 ల‌క్ష‌ల ఆర్థిక సాయం అందించాను. ఆ చిన్నారి గొంతులో మాటలు పలికించడం మాత్రమే కాదు.. తన భవిష్యత్తు, చదువు బాధ్యత కూడా నాదే. ఉప్ప‌ల్‌లో ఉన్న‌ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చ‌దివిస్తా అని కోమ‌టిరెడ్డి కొండంత భ‌రోసా క‌ల్పించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా పనిగిరి గ్రామానికి చెందిన జంపాల మహేష్ కుమార్, రజిత దంపతులు ఇద్దరూ మూగ, చెవిటి వారు. వారి చిన్నారి కూడా అదే సమస్యతో జన్మించడంతో, ఖరీదైన వైద్యం చేయించలేక వారు మంత్రి కోమ‌టిరెడ్డిని ఆశ్రయించారు. స్పందించిన వెంక‌ట్‌రెడ్డి మాన‌వ‌త్వంతో బాధిత కుటుంబానికి అండ‌గా నిలుస్తున్నారు.

Advertisement
Advertisement