త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priya Bhavani Shankar | ఇరుముడి హీరోయిన్‌కు ల‌క్కీ ఛాన్స్ – నాని, నితిన్ సినిమాలో రుక్మిణిగా?

ఇరుముడితో హీరోయిన్‌గా తెలుగులో తొలి విజ‌యాన్ని అందుకుంది ప్రియా భ‌వానీ శంక‌ర్‌. ర‌వితేజ హీరోగా న‌టించిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో మూడు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఇరుముడి బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో ప్రియా భ‌వానీ శంక‌ర్ తెలుగులో ల‌క్కీ ఛాన్స్ అందుకున్న‌ట్లు స‌మాచారం. నితిన్ క‌థానాయ‌కుడిగా హీరో నాని నిర్మాణంలో రూపొందుతోన్న అలియాస్ రుక్మిణిలో ప్రియా భ‌వానీ శంక‌ర్ హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు తెలిసింది.

N

Entertainment | Published On Sep 18, 2026, 2.20 pm IST

Priya Bhavani Shankar | ఇరుముడి హీరోయిన్‌కు ల‌క్కీ ఛాన్స్ – నాని, నితిన్ సినిమాలో రుక్మిణిగా?
Advertisement

Priya Bhavani Shankar |  ఇరుముడితో తెలుగులో పెద్ద విజ‌యాన్ని అందుకుంది కోలీవుడ్ బ్యూటీ ప్రియా భ‌వానీ శంక‌ర్‌. ర‌వితేజ హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ మూడు వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఏడాది తెలుగులో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇరుముడిలో కావేరి అనే పాత్ర‌లో ప్రియా భ‌వానీ శంక‌ర్ క‌నిపించింది. ఓ చిన్నారికి త‌ల్లిగా స‌హ‌జ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.

ల‌క్కీ ఛాన్స్‌...

ఇరుముడి స‌క్సెస్‌తో తెలుగులో ఈ ముద్దుగుమ్మ ల‌క్కీ ఛాన్స్ అందుకున్న‌ట్లు స‌మాచారం. నితిన్ క‌థానాయ‌కుడిగా హీరో నాని నిర్మాత‌గా అలియాస్ రుక్మిణి పేరుతో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ రాబోతుంది. ఇటీవ‌లే ఈ సినిమా లాంఛ్ అయ్యింది. దండోరా ఫేమ్ ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

నెలాఖ‌రు నుంచి...

అలియాస్ రుక్మిణిలో హీరోయిన్‌గా రుక్మిణి వ‌సంత్‌తో పాటు మ‌రికొంద‌రి పేర్లు వినిపించాయి. కానీ వారంద‌రిని కాద‌ని ఈ ఛాన్స్ ప్రియా భ‌వానీ శంక‌ర్‌ను వ‌రించిన‌ట్లు తెలిసింది. సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు నుంచి ఈ కోలీవుడ్ సుంద‌రి అలియాస్ రుక్మిణి షూటింగ్‌లో జాయిన్ కాబోతున్న‌ట్లు తెలిసింది.

ర‌చ‌యిత‌గా...

అలియాస్ రుక్మిణిలో కృష్ణ అనే రైట‌ర్ పాత్ర‌లో నితిన్ క‌నిపించ‌బోతున్నాడు. రుక్మిణి అనే మారుపేరుతో న‌వ‌ల‌లు రాస్తుంటాడు. అస‌లు రుక్మిణి ఎవ‌రు? అనే అంశాల‌తో ఈ మూవీ రూపొందుతోంది.
అలియాస్ రుక్మిణి రిలీజ్ డేట్ ఖ‌రారు అయిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. డిసెంబ‌ర్ 3న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ 40 శాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. లిమిటెడ్ బ‌డ్జెట్‌తో త‌క్కువ రోజుల్లో ప్ర‌యోగాత్మ‌కంగా మేక‌ర్స్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్న‌ట్లు స‌మాచారం.

క‌ళ్యాణం క‌మ‌నీయం...

ఇరుముడి కంటే ముందు తెలుగులో క‌ళ్యాణం క‌మ‌నీయం, జీబ్రా, భీమా సినిమాలు చేసింది ప్రియా భ‌వానీ శంక‌ర్‌. ప్ర‌స్తుతం త‌మిళంలో డీమాంటే కాల‌నీ 3తో పాటు మ‌రుగ‌ద నాన్యం 2 సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలు తెలుగులో డ‌బ్ కాబోతున్నాయి.

 

Advertisement
Advertisement