Kunamneni Sambashiva Rao | రాష్ట్రంలో తీవ్రంగా కరెంట్ సమస్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
Kunamneni Sambashiva Rao | రాష్ట్రంలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కరెంట్ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Kunamneni Sambashiva Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కరెంట్ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. శాసనసభలో జీరో అవర్ సందర్భంగా కరెంట్ సమస్యను కూనంనేని లేవనెత్తారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ముఖ్యంగా కరెంట్ సమస్య తీవ్రంగా ఉంది. దీనికి ఎల్‌నినో ఒకటి, వర్షాభావ పరిస్థితుల వల్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. పీక్ అవర్స్‌లో డిమాండ్ 300 మిలియన్ యూనిట్స్ రోజుకు కావాలి. ఇనస్టాలేషన్ కెపాసిటీ 130 మిలియన్ యూనిట్స్ ఉంది. మిగిలిన గ్యాప్ కొనుగోలు చేయాల్సి వస్తది. కొత్త యూనిట్స్‌ను నిర్మాణం చేసుకునేందుకు ప్రభుత్వానికి బాధ్యత కూడా ఉంది. శ్రద్ధ కూడా పెట్టాలి అని కూనంనేని అన్నారు.
థర్మల్ పవర్ స్టేషన్ వద్దు.. కాలుష్యం, నష్టాలు వస్తాయని చెబుతున్నారు. హైడల్ పవర్ మీద ఆధారపడ్డాం.. కానీ వర్షాల్లేవు.. ఉత్పత్తి ఆగిపోయింది. సోలార్ పవర్ వాతావరణాన్ని బట్టి ఉంటుంది. కేటీపీఎస్ పాత ప్లాంట్ ప్లేస్‌లో 500 ఎకరాల భూమి ఎస్టాబ్లిస్ అయి ఉంది. బయట అయితే 16 కోట్లు అయితే ఒక మెగావాట్ ప్రొడక్షన్ అవుతుంది. మన దగ్గర అయితే 12 కోట్లతో ఒక మెగావాట్ అయిపోతది. కిన్నెరసాని వాటర్ ఉంది. రైల్వే కెనెక్టివిటీ ఉంది. సింగరేణి బొగ్గు ఉంది. స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంది. అన్ని సదుపాయాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎంను కోరుతున్నా.. పవర్ కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. కేవలం సోలార్ మీద ఆధారపడకుండా, హైడల్ మీద ఆధారపడకుండా.. థర్మల్ పవర్ స్టేషన్‌ను మంజూరు చేయాల్సిందిగా డిప్యూటీ సీఎంను కోరుతున్నాను.. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూనంనేని సాంబశివరావు అన్నారు.
సంబంధిత వార్తలు

MLA Rakesh Reddy | 3 జిల్లాలకే అభివృద్ధి పరిమితమైంది.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్
సెప్టెంబర్ 18, 2026

Privilege Notice Against CM Revanth | సీఎం రేవంత్‌పై సభా హక్కుల నోటీస్.. స్పీకర్‌కు అందజేసిన బీఆర్ఎస్ శాసన సభాపక్షం
సెప్టెంబర్ 18, 2026

Young man’s suicide | ప్రియురాలి వల్లే చనిపోతున్నా.. స్టీల్ బ్రిడ్జి పైనుంచి దూకిన యువకుడు
సెప్టెంబర్ 18, 2026
తాజావార్తలు
- ●MLA Rakesh Reddy | 3 జిల్లాలకే అభివృద్ధి పరిమితమైంది.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్
- ●Nestle India | పసిపిల్లల పోషకాహార ఉత్పత్తుల్లో నిబంధనల ఉల్లంఘన.. నెస్లే ఇండియాపై FSSAI లీగల్ యాక్షన్
- ●Samsung Galaxy S26 | శాంసంగ్ ఫోన్‌ను కొనాలంటే ఇప్పుడే తీసుకోండి.. భారీగా పెరగనున్న ధరలు..
- ●Trisha | చెన్నై క్వీన్ డబుల్ ధమాకా - సంక్రాంతి బరిలో త్రిష రెండు సినిమాలు
- ●Privilege Notice Against CM Revanth | సీఎం రేవంత్‌పై సభా హక్కుల నోటీస్.. స్పీకర్‌కు అందజేసిన బీఆర్ఎస్ శాసన సభాపక్షం
- ●Air Passengers | పిడిగుద్దుల వర్షం.. విమానంలో దారుణంగా కొట్టుకున్న ప్రయాణికులు

MLA Rakesh Reddy | 3 జిల్లాలకే అభివృద్ధి పరిమితమైంది.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్

Nestle India | పసిపిల్లల పోషకాహార ఉత్పత్తుల్లో నిబంధనల ఉల్లంఘన.. నెస్లే ఇండియాపై FSSAI లీగల్ యాక్షన్

Samsung Galaxy S26 | శాంసంగ్ ఫోన్‌ను కొనాలంటే ఇప్పుడే తీసుకోండి.. భారీగా పెరగనున్న ధరలు..

Trisha | చెన్నై క్వీన్ డబుల్ ధమాకా - సంక్రాంతి బరిలో త్రిష రెండు సినిమాలు



