త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tandur Police | వాళ్లకు టెంట్ హౌస్ సామాన్లు ఇస్తే..మీరు జైలుకే

Tandur Police | ఆర్టీసీ కార్మికుల స‌మ్మె (RTC Strike) రెండో రోజూ కొన‌సాగుతున్న‌ది. రాష్ట్ర‌వ్యాప్తంగా డిపోల నుంచి బ‌స్సులు బ‌య‌ట‌కు రాలేదు. ఔట్ సోర్సింగ్ సిబ్బందితో అధికారులు అర‌కొరగా బ‌స్సుల‌ను న‌డుపుతున్నారు.

G

Telangana | Published On Apr 23, 2026, 9.17 am IST

Tandur Police | వాళ్లకు టెంట్ హౌస్ సామాన్లు ఇస్తే..మీరు జైలుకే
Advertisement
  • తాండూరులో పోలీసుల ఆంక్షలు

  • ఆర్టీసీ కార్మికులకు హాళ్లను కిరాయికి ఇస్తే.. చర్యలు తప్పవంటూ హెచ్చరికలు

  • సమ్మెపై ఉక్కు పాదం

Tandur Police | త్రినేత్ర‌.న్యూస్‌: ఆర్టీసీ కార్మికుల స‌మ్మె (RTC Strike) రెండో రోజూ కొన‌సాగుతున్న‌ది. రాష్ట్ర‌వ్యాప్తంగా డిపోల నుంచి బ‌స్సులు బ‌య‌ట‌కు రాలేదు. ఔట్ సోర్సింగ్ సిబ్బందితో అధికారులు అర‌కొరగా బ‌స్సుల‌ను న‌డుపుతున్నారు. బ‌స్సులు బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా బ‌స్టాండ్ల‌లో ఆర్టీసీ కార్మికులు (TGS RTC) అడ్డుకుంటున్నారు. దీంతో డిపోలు, బ‌స్టాండ్ల‌లో పెద్ద సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రించారు. కాగా, తాండూరు పోలీసులు (Tandur Police) ఒక అడుగు ముందుకు వేశారు. టెంట్ హౌస్, ఫంక్ష‌న్ హాళ్లు, క‌మ్మూనిటీ, క‌న్వెన్ష‌న్ హాల్ ఓన‌ర్ల‌కు హెచ్చ‌రిక‌లు జారీచేశారు.

చ‌ట్ట విరుద్ధంగా, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆర్టీసీ కార్మికుల స‌మ్మె సాగుతున్న‌ద‌ని, స‌మ్మెకు ఎలాంటి అనుమ‌తి లేద‌ని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు సామాన్లు, టెంట్లు, హాళ్ల‌ను కిరాయికి ఇస్తే స‌మ్మెకు మ‌ద్ద‌తు ప‌లికిన‌ట్లేన‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఈ మేర‌కు తాండూరు పోలీసులు టెంటు హౌస్‌, ఫంక్ష‌న్ హాల్ నిర్వాహ‌కుల‌కు నోటీసులు జారీచేశారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement