Suicide | పిల్లలను బావిలో తోసి.. ఆపై తానూ దూకి తల్లి ఆత్మహత్య
Suicide | రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో (Shankarpally) విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసిసిన తల్లి.. తానూ ఆత్మహత్య (Suicide) చేసుకుంది.
Suicide | త్రినేత్ర.న్యూస్: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో (Shankarpally) విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసిసిన తల్లి.. తానూ ఆత్మహత్య (Suicide) చేసుకుంది. వికారాబాద్ (Vikarabad) జిల్లా తాండూరుకు చెందిన వసంత, సుధాకర్ దంపతులు శంకర్పల్లి సమీపంలో కొత్తపల్లిలో స్థిరపడ్డారు. వీరికి నవ్వ (15), పదేండ్ల కుమారుడు ఉన్నారు. అయితే గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన వసంత.. కూతురు నవ్య, కుమారుడిని బావిలోకి తోసి ఆపై ఆమె కూడా దూకేసింది.
అయితే నీటిలో మునిగి తల్లి, కూతురు మృతిచెందగా.. కుమారుడు చెట్టుకొమ్మను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలుడిని రక్షించారు. మృతదేహాలను బావి నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో (Family Dispute) ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తున్నది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Road Accident | గొర్రెల వ్యాన్‌ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. ఇద్దరు మృతి
- ●SBI Funds Management IPO | ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ అలాట్మెంట్ నేడే.. స్టేటస్ ఎలా చెక్ చేయాలి..?
- ●Chanagani Dayakar | యువ సంగ్రామ సదస్సు కాదు.. నిరుద్యోగులకు బీఆర్ఎస్ చేసిన విద్రోహ సభ: చనగాని దయాకర్
- ●Hydrogen Train | పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- ●GIGABYTE | గిగాబైట్ మేడ్ ఇన్ ఇండియా గేమింగ్ ల్యాప్‌టాప్.. భారత్‌లోనే తయారీ..
- ●NICL Assistant Recruitment | నేషనల్ ఇన్సూరెన్స్‌లో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు..

Road Accident | గొర్రెల వ్యాన్‌ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. ఇద్దరు మృతి

SBI Funds Management IPO | ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ అలాట్మెంట్ నేడే.. స్టేటస్ ఎలా చెక్ చేయాలి..?

Chanagani Dayakar | యువ సంగ్రామ సదస్సు కాదు.. నిరుద్యోగులకు బీఆర్ఎస్ చేసిన విద్రోహ సభ: చనగాని దయాకర్

Hydrogen Train | పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ






