Talasani Srinivas Yadav | ఏ 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామో మేము చెప్పినమా?.. సీఎం తలసాని
Talasani Srinivas Yadav | 100 రోజుల్లో హామీలు అలు చేస్తామని చెబితే మాకు అధికారం ఇచ్చారు.. కానీ ఏ వంద రోజుల్లోనో అని చెప్పామా అని సీఎం తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. `బాండ్ పేపర్లమీద 100 వంద రోజులు అనే రాసిచ్చినం.. ఏ వంద రోజులో చెప్పలే. 5 ఏండ్లు కాదు 25 ఏండ్లు మీమే ఉంటాం.. ఎప్పుడో ఒకప్పుడు చేస్తాం.`
Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్: 100 రోజుల్లో హామీలు అలు చేస్తామని చెబితే మాకు అధికారం ఇచ్చారు.. కానీ ఏ వంద రోజుల్లోనో అని చెప్పామా అని సీఎం తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. `బాండ్ పేపర్లమీద 100 వంద రోజులు అనే రాసిచ్చినం.. ఏ వంద రోజులో చెప్పలే. 5 ఏండ్లు కాదు 25 ఏండ్లు మీమే ఉంటాం.. ఎప్పుడో ఒకప్పుడు చేస్తాం. ఢిల్లీ వాళ్లతో మాకున్న ఇబ్బందులు మాకున్నాయి. మా వాళ్లతోనూ ఇబ్బందులు ఉన్నాయి` అని చెప్పారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాక్ అసెంబ్లీ (BRS Mock Assembly) నిర్వహిస్తున్నారు. ఇందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రిగా, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పీకర్‌గా, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సీఎం తలసాని మాట్లాడుతూ..
`నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఢిల్లీతో సమస్య, పార్టీలో సమస్య. ఆఖరికి బీఆర్ఎస్‌తో (BRS) కూడా ప్రశాంతత లేదు. ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును మా ఇందిరా గాంధీ కట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాం. ఏ సంవత్సరం వంద రోజులో మేము చెప్పలేదు కదా.! ఢిల్లీ వాళ్ళతో మాకుండే ఇబ్బందులు మాకు ఉన్నాయి. ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని మేము చూశాం. రైతాంగం ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీకి పోతే మమ్మల్ని చూసేవాడే లేడు. సభ్యులు సభలో సబ్జెక్టు తప్పా ఏమైనా మాట్లాడుకోండి` అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు.
100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాము కానీ ఏ 100 రోజులో చెప్పామా?
ఢిల్లీ వాళ్ళతో మాకుండే ఇబ్బందులు మాకు ఉన్నాయి
- మాక్ అసెంబ్లీలో సీఎం తలసాని pic.twitter.com/Cxb3tC1wIw
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2026
సంబంధిత వార్తలు

Jagadeesh Reddy | నీళ్లన్నీ ఆంధ్రాకు దోచుకెళ్తున్నరు
సెప్టెంబర్ 12, 2026

Harish Rawat | ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్.. పదవుల నుంచి తప్పుకున్న మాజీ సీఎం
సెప్టెంబర్ 12, 2026

Omar Abdullah | కశ్మీరీలు జైల్లో ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందా..? : వందేమాతరం ఆలాపనపై మిత్రపక్షాన్ని ప్రశ్నించిన సీఎం ఒమర్ అబ్దుల్లా
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Smartwatch | స్మార్ట్ వాచ్ ధరిస్తే తలనొప్పి వస్తుందా..? వైద్యులు ఏం చెబుతున్నారు..?
- ●Delhi To Guangzhou direct flights | జిన్‌పింగ్ భారత పర్యటన వేళ కీలక పరిణామం.. ఆరేళ్ల తర్వాత ఢిల్లీకి చైనా విమాన సర్వీసులు
- ●Renu Desai | లవ్‌స్టోరీతో రేణుదేశాయ్ రీఎంట్రీ - డైరెక్ట్‌గా ఓటీటీలో మూవీ రిలీజ్
- ●Adi Srinivas | పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారు.. వీరప్పన్‌ను మించిన ఘనులు బీఆర్ఎస్ నేతలు: ఆది శ్రీనివాస్
- ●Vladimir Putin | వారి వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతోంది : పుతిన్
- ●Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. ఇక ట్యాగ్ చేసిన పోస్టులూ ప్రొఫైల్‌లోనే..

Smartwatch | స్మార్ట్ వాచ్ ధరిస్తే తలనొప్పి వస్తుందా..? వైద్యులు ఏం చెబుతున్నారు..?

Delhi To Guangzhou direct flights | జిన్‌పింగ్ భారత పర్యటన వేళ కీలక పరిణామం.. ఆరేళ్ల తర్వాత ఢిల్లీకి చైనా విమాన సర్వీసులు

Renu Desai | లవ్‌స్టోరీతో రేణుదేశాయ్ రీఎంట్రీ - డైరెక్ట్‌గా ఓటీటీలో మూవీ రిలీజ్

Adi Srinivas | పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారు.. వీరప్పన్‌ను మించిన ఘనులు బీఆర్ఎస్ నేతలు: ఆది శ్రీనివాస్



