త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jaggareddy | రాహుల్ గాంధీకి మ‌ద్ద‌తుగా మ‌నం వీధుల్లోకి రావాల్సిందే

Jaggareddy | దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ( Rahul Gandhi ) వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుండు అని టీ పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి( Jagga Reddy ) పేర్కొన్నారు. ఆయనకు మద్దతుగా మనమందరం వీధుల్లోకి రావాల్సిందే అని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Oct 12, 2026, 4.16 pm IST

Jaggareddy | రాహుల్ గాంధీకి మ‌ద్ద‌తుగా మ‌నం వీధుల్లోకి రావాల్సిందే
Advertisement

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జ‌గ్గారెడ్డి భారీ నిర‌స‌న ర్యాలీ

Jaggareddy | త్రినేత్ర న్యూస్ : దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ( Rahul Gandhi ) వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుండు అని టీ పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి( Jagga Reddy ) పేర్కొన్నారు. ఆయనకు మద్దతుగా మనమందరం వీధుల్లోకి రావాల్సిందే అని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీకి మ‌ద్ద‌తుగా నిర్వ‌హించిన భారీ ర్యాలీలో జ‌గ్గారెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

మన అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీ రోడ్లపై ఉంటే మనం ఇళ్లలో పడుకోవడం కరెక్టేనా..? రాహుల్ గాంధీ పోరాటానికి కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు దేశ ప్రజలందరూ మద్దతు ఇవ్వాలి. దేశంలో ఓటు చోరీ జరుగుతుంది. బీజేపీ ప్రజల హక్కులను కాలరాస్తోంది. ఇదే విషయాన్ని ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మరో పదిమందికి ప్రచారం చేయాలి. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు రాహుల్ గాంధీ పోరాటం ఆపబోనని ప్రకటించారు. ఆయన డిమాండ్ నెరవేరేవరకు ఆయనకు మద్దతుగా సంగారెడ్డిలో నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని జ‌గ్గారెడ్డి తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement