Jaggareddy | మోదీ ఇంటి ముందు ధర్నా చేస్తే తప్పేంటి..? : జగ్గారెడ్డి
Jaggareddy | నీట్ పేపర్ లీకేజీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి వద్ద కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ధర్నా చేస్తే తప్పేంటి..? అని బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిలదీశారు.
Jaggareddy | త్రినేత్ర.న్యూస్ : నీట్ పేపర్ లీకేజీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి వద్ద కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ధర్నా చేస్తే తప్పేంటి..? అని బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిలదీశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండో రోజు ఆందోళనలు కొనసాగించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి ప్రసంగించారు.
గాంధీ భవన్‌ను ముట్టడిస్తామని రామచందర్ రావు అంటుండు.. అసలు గాంధీ భవన్‌కు వచ్చి ఏం చేస్తారు..? మీరు గాంధీ భవన్‌ను ముట్టడిస్తే.. మేం బీజేపీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. మీకు చేతనైతే ప్రధాని మోదీతో నీట్ విద్యార్థులకు క్షమాపణ చెప్పించండి అని డిమాండ్ చేశారు.
ప్రధాని బేషరతుగా క్షమాపణ చెప్పాలి
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తక్షణమే రాజీనామా చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే మిమ్మల్ని, కేంద్ర మంత్రులని ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నీట్ విద్యార్థులకు కనీసం క్షమాపణ చెప్పలేదు. ప్రధాని నరేంద్ర మోదీ మొండిగా వ్యవహరిస్తున్నారు.. ప్రధాని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మతం, దేవుడి పేరుతో ఓట్లు తెచ్చుకున్న బీజేపీకి విద్యార్థుల సమస్యలు పట్టవు అని జగ్గారెడ్డి మండిపడ్డారు.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






