త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shabad Rajkumar Suicide | షాబాద్ ‘సైకో కిల్లర్’ మృతి.. మేన‌మామ ఊరిలో ఆత్మ‌హ‌త్య‌

Shabad Rajkumar Suicide | షాబాద్ సైకో కిల్ల‌ర్ క‌థ అంత‌మైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని త‌న మేన‌మామ ఊరు పంజ‌ర్ల‌లో ఆ కిరాత‌కుడు సోమ‌వారం శ‌వ‌మై క‌నిపించాడు.

S

Telangana | Published On Jul 13, 2026, 5.06 pm IST

Shabad Rajkumar Suicide | షాబాద్ ‘సైకో కిల్లర్’ మృతి.. మేన‌మామ ఊరిలో ఆత్మ‌హ‌త్య‌
Advertisement

Shabad Rajkumar Suicide | త్రినేత్ర‌.న్యూస్: షాబాద్ సైకో కిల్ల‌ర్ క‌థ అంత‌మైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని త‌న మేన‌మామ ఊరు పంజ‌ర్ల‌లో ఆ కిరాత‌కుడు సోమ‌వారం శ‌వ‌మై క‌నిపించాడు. పోలీసులు త‌న కోసం తీవ్రంగా వేట సాగిస్తున్న క్ర‌మంలో పంజ‌ర్ల‌కు గ్రామ శివారులోకి వెళ్లి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికులు గ‌మ‌నించి 100కు డ‌య‌ల్ చేసి చెప్ప‌డంతో పోలీసులు చేరుకొని నిందితుడు ఆత్మ‌హత్య చేసుకున్న‌ట్లు నిర్ధారించారు.

పోలీసుల ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి. పంజర్ల గ్రామ శివారు ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంట‌నే తాము ఘటనా స్థలానికి చేరుకుని రాజ్‌కుమార్ మృత‌దేహంగా గుర్తించాం. పక్కనే పురుగుల మందు బాటిల్ దొరికింది. దీంతో అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నాం. ఈ విష‌యాన్ని రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులకు చేర‌వేశాం. వారు ఇక్క‌డికి చేరుకుంటున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నాం అని పోలీసులు తెలిపారు. మ‌రోవైపు ఘ‌ట‌నా స్థ‌లంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అయితే నిందితుడిని పట్టుకునేందుకు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు 12 ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల రివార్డ్ సైతం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement