Woman Was Killed | ప్రేమను నిరాకరించిందని.. బస్టాండ్‌లో యువతిని నరికి చంపిన యువకుడు
Woman Was Killed | కర్ణాటక (Karnataka) బంట్వాల్‌లో దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో బస్టాండ్‌లో బస్సుకోసం వెయిట్ చేస్తున్న యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు.
Woman Was Killed | కర్ణాటక (Karnataka)లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు తన ప్రేమను తిరస్కరించిందన్న కారణంతో యువతిని కత్తితో నరికి హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి ఒడిగట్టాడు. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ (Bantwal)లోని బీసీ రోడ్ వద్ద గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 21 ఏళ్ల బాధితురాలు కల్లాడ్కలోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తోంది. బెల్తంగడికి చెందిన ఓడిల్నాలా నివాసి చేతన్.. గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో ఆ యువతి వెంట పడుతున్నాడు. అయితే, అతడి ప్రేమను ఆ యువతి తిరస్కరించింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం బీసీ రోడ్ వద్ద ఉన్న కేఎస్‌ఆర్‌టీసీ (KSRTC) కొత్త బస్టాండ్‌లో బస్సుకోసం వెయిట్ చేస్తున్న యువతిపై చేతన్ కత్తితో దాడి చేశాడు.
యువతి పారిపోయేందుకు ప్రయత్నించగా.. అందరూ చూస్తుండగానే ఆమెను వెంబడించి మరీ కత్తితో దారుణంగా పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి దృశ్యాలు బస్టాండ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. రక్తం మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్న యువతిని హుటాహుటిన బంట్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read..
దేవుళ్ల పాత ఫొటోలు ఉన్నాయా..? మాకు ఇచ్చేయండి..!
స్పేస్‌ఎక్స్ కు షాక్.. 903 బిలియన్ డాలర్లు ఆవిరి.. ఐపీఓ మార్కెట్‌లకు భారీ దెబ్బ..
మట్టపల్లి క్షేత్రానికి పర్యాటక శోభ.. టూరిజం అభివృద్ధి, బోటింగ్ ఏర్పాటుకు నిధుల మంజూరు..
తాజావార్తలు
- ●High-Rise Apartment Struggles | "పక్షులు కూడా మనుషులను వింతగా చూస్తాయి!" - 20వ అంతస్తులో నివసించే వారి విచిత్ర కష్టాలపై వీడియో వైరల్
- ●Personal Loan | ఒకేసారి ఎన్ని వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు? ఇలా చేస్తే ఆర్థిక భారం తప్పదు..
- ●Traffic Restrictions | గణేశ్ నిమజ్జనం.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Vinay Bhaskar | వరంగల్ ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తోపులాటలో వినయ్ భాస్కర్ కంటతడి
- ●IIT Bombay | ఐఐటీ బాంబే హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లు తొలగింపు.. విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో యాజమాన్యం కీలక నిర్ణయం
- ●iPhone 18 Pro Snatching | 'ఇది కొత్త ఐఫోనా?' అని అడిగి.. ఆటోలో వెళ్తున్న యువతి చేతిలో నుంచి ఐఫోన్ 18 ప్రో లాక్కెళ్లిన దొంగలు

High-Rise Apartment Struggles | "పక్షులు కూడా మనుషులను వింతగా చూస్తాయి!" - 20వ అంతస్తులో నివసించే వారి విచిత్ర కష్టాలపై వీడియో వైరల్

Personal Loan | ఒకేసారి ఎన్ని వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు? ఇలా చేస్తే ఆర్థిక భారం తప్పదు..

Traffic Restrictions | గణేశ్ నిమజ్జనం.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు

Vinay Bhaskar | వరంగల్ ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తోపులాటలో వినయ్ భాస్కర్ కంటతడి






