త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rains | వ‌రంగ‌ల్‌లో భారీ వ‌ర్షం.. స్తంభించిన జన‌జీవ‌నం

Heavy Rains | తెలంగాణ వ్యాప్తంగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. ప‌లు జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తున్నాయి. అయితే వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ జిల్లాల్లో మాత్రం భారీ వ‌ర్షం( Heavy Rains ) కురిసింది.

S

Telangana | Published On Jul 17, 2026, 1.41 pm IST

Heavy Rains | వ‌రంగ‌ల్‌లో భారీ వ‌ర్షం.. స్తంభించిన జన‌జీవ‌నం
Advertisement

Heavy Rains | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. ప‌లు జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తున్నాయి. అయితే వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ జిల్లాల్లో మాత్రం భారీ వ‌ర్షం( Heavy Rains ) కురిసింది. ఉద‌యం 8.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌లు ప్రాంతాల్లో మోస్త‌రు వ‌ర్షం, కొన్ని ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. దీంతో వ‌రంగ‌ల్ న‌గ‌రం త‌డిసి ముద్దైంది. జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపోయింది. ఈ క్ర‌మంలో వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ జిల్లాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు హ‌నుమ‌కొండ‌లో 61 మి.మీ., కాజీపేట‌లో 56, ఖిల్లా వ‌రంగ‌ల్‌లో 54, వ‌రంగ‌ల్‌లో 50 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

Advertisement
Advertisement