Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్..
Software Engineer | హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. ప్రియురాలిని (Girlfriend) ఆమె ఇంట్లోనే చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Software Engineer).. రైలుకిందపడి తానూ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
Software Engineer | త్రినేత్ర.న్యూస్: హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. ప్రియురాలిని (Girlfriend) ఆమె ఇంట్లోనే చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Software Engineer).. రైలుకిందపడి తానూ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. యువతి ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) సీతాపూర్‌కి చెందిన ఇషారా అయూబీ గత కొంతకాలంగా గురుగ్రామ్‌లోని (Gurugram) సెక్టార్ 55లో ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నది. ఆమె కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు ఘటనా స్థలానికి వెళ్లి.. తలుపులు బద్దలుకొట్టి చూడగా అయూబీ రక్తపు మడుగులో పడి ఉన్నది. ఆమెను కత్తితో పొడిచి చంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. విచారణలో ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రేష్ట్ మాలిక్ (25) ఆమె ఫ్లాట్‌కు వచ్చి వెళ్లినట్లు గుర్తించారు.
అతడి కోసం గాలిస్తుండగా.. గర్హి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై (Train) ఓ యువకుడి మృతదేహం రెండు ముక్కలుగా పడి ఉన్నట్లు సమాచారం అందింది. అక్కడ లభించిన ఫోన్ ఆధారంగా మృతుడిని మాలిక్‌గా (Shresth Malik) గుర్తించారు. దీంతో ఈ రెండు ఘటనలకు సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు. అయూబీని హత్య చేసిన తర్వాతే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, గత మూడు రోజులగానే ఇద్దరు కలిసి ఉంటున్నట్లు వెల్లడించారు. అయితే హత్య, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇద్దరి ఫోన్లు, కాల్ డాటా, వాట్సాప్ చాట్స్ ఆధారంగా ఏవైనా విషయాలు తెలిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో వాటిని ఫోరెన్సిక్ విభాగానికి పంపినట్లు చెప్పారు.
సంబంధిత వార్తలు

Murder | ఇద్దరు కుమార్తెలను చంపి.. గొంతు కోసుకున్న తండ్రి..!
ఆగస్టు 11, 2026

NEET Student | కానూరులో నీట్ కోచింగ్.. కుటుంబానికి దూరంగా ఉండలేక హైదరాబాద్ యువతి బలవన్మరణం
ఆగస్టు 6, 2026

Rajasthan High Court | విద్యార్థిని టీచర్ మందలించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు : రాజస్థాన్ హైకోర్టు
జులై 28, 2026
తాజావార్తలు
- ●Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్‌ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
- ●Mumbai Local Train | ముంబై లోకల్ ట్రైన్ అంటే దడదడ.. ఎక్కలేక చేతులెత్తేసిన కొరియన్ టూరిస్ట్
- ●Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!
- ●Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!
- ●IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!
- ●Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!

Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్‌ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Mumbai Local Train | ముంబై లోకల్ ట్రైన్ అంటే దడదడ.. ఎక్కలేక చేతులెత్తేసిన కొరియన్ టూరిస్ట్

Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!

Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!



