త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New Pensions | అర్హులంద‌రికీ కొత్త పెన్ష‌న్లు.. ఆగ‌స్టు 15 నుంచి పంపిణి: మంత్రి సీత‌క్క‌

New Pensions | రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. ఒంట‌రి మ‌హిళ‌లు, వితంతువులు, అర్హులైన‌వారంద‌రికీ ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు (New Pensions) అందించ‌నున్న‌ట్లు తెలిపింది.

G

Telangana | Published On Jul 17, 2026, 1.19 pm IST

New Pensions | అర్హులంద‌రికీ కొత్త పెన్ష‌న్లు.. ఆగ‌స్టు 15 నుంచి పంపిణి: మంత్రి సీత‌క్క‌
Advertisement

New Pensions | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. ఒంట‌రి మ‌హిళ‌లు, వితంతువులు, అర్హులైన‌వారంద‌రికీ ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు (New Pensions) అందించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈమేర‌కు మంత్రి సీత‌క్క వెల్ల‌డించారు. ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీత‌క్క (Seethakka) మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ ప‌థ‌కాలు అర్హులైనవారంద‌రికీ అందేలా ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌న్నారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణిస్తే వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.

ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని, అర్హత ఉండి కూడా లబ్ధి పొందని వారిని గుర్తించి పథకాలను వర్తింపజేయాలన్నారు. పథకాల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పింఛన్ల పంపిణీ చేయాలని పేర్కొన్నారు. అనర్హులు పింఛన్లు పొందడం వల్ల నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని, అందువ‌ల్ల కేవ‌లం అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాగా, రాష్ట్రంలో కొత్త పెన్ష‌న్లు ఇస్తామ‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. సుమారు 2 నుంచి 3 ల‌క్ష‌ల పింఛ‌న్లు అందిచేలా క‌ర‌స్తు చేస్తున్న‌ది.

Advertisement
Advertisement