త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | ఫార‌మ్‌-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొల‌గించిన‌ట్టు కాదు

Ramchandar Rao | హైదరాబాద్‍లో ఫారమ్-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొల‌గించిన‌ట్టు కాద‌ని.. ఆ ఫార‌మ్ స‌మ‌ర్పిస్తే ఈసీ విచార‌ణ చేసి తగు చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు తెలిపారు.

S

Telangana | Published On Oct 4, 2026, 1.36 pm IST

Ramchandar Rao | ఫార‌మ్‌-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొల‌గించిన‌ట్టు కాదు
Advertisement
  • ఈసీ విచారణ చేసి చర్యలు తీసుకుంటుంది
  • వ‌రుస‌ ఓట‌ముల‌తోనే కాంగ్రెస్ నేత‌లు ఈవీఎంలు, స‌ర్ పై విషం చిమ్ముతున్నారు
  • ఖ‌ర్గే వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాం
  • మీడియా స‌మావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు ఫైర్‌

Ramchandar Rao | త్రినేత్ర న్యూస్‌: హైదరాబాద్‍లో ఫారమ్-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొల‌గించిన‌ట్టు కాద‌ని.. ఆ ఫార‌మ్ స‌మ‌ర్పిస్తే ఈసీ విచార‌ణ చేసి తగు చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు తెలిపారు. వ‌రుస ఓట‌ముల‌తోనే కాంగ్రెస్ నాయ‌కులు ఈవీఎంలు, స‌ర్ పై విషం చిమ్ముతున్నార‌ని మండిప‌డ్డారు. మ‌ల్లికార్జున ఖ‌ర్గే వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఆదివారం నాంప‌ల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయ‌కుల తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర‌య్యారు.

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వరుసగా ఓడిపోవ‌డం, మోదీ మూడుసార్లు ప్ర‌ధాని కావడం తట్టుకోలేక ఈసీపై విమర్శలు చేస్తోంది. నెహ్రూ కుటుంబం నుంచి ఇక ఈ దేశానికి ప్రధాన మంత్రి కారు అనే భయంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలన్నీ చట్టవిరుద్ధమేనని, లోక్ సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలు జరపాలన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కాంగ్రెస్ మాటలు ప్రజాస్వామ్యాన్ని, భారతీయ ఓటర్లను అవమానించేలా ఉన్నాయి.

త్వ‌ర‌లోనే కాంగ్రెస్ ముక్త్ భార‌త్‌..

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులే చేస్తారు. అభ్యంతరం ఉన్న ఓటర్ల విషయంలో ఫారమ్ -7 సమర్పిస్తే వాటిపై ఈసీ విచారణ చేసి చర్యలు తీసుకుంటుంది. ఈ ఫారమ్-7 లు బీజేపీ బీఎల్ఏలు ఎవరూ ఇవ్వలేదు. ఫారమ్ సమర్పించినంత మాత్రాన ఓట్లు తొలగిస్తున్నారనే వాదన చేయడం సరికాదు. ఎన్నికల్లో ఓడిపోయిన చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్, ఈవీఎంలపై మాట్లాడుతోంది. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతల మాటలకు దేశ ప్రజలు బుద్ధి చెబుతారు. త్వరలోనే కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తాం అని హెచ్చరించారు.

ఎవ‌రూ పీఎం కాలేరనే..

రాజ్యాంగ బద్ధమైన సుప్రీంకోర్టు, ఈసీ వంటి సంస్థలపై రాహుల్ గాంధీ, ప్రకాశ్ రాజ్ లాంటి వారు పదే పదే విమర్శలు చేస్తున్నారు. భారతదేశాన్ని బలహీన పరచాలనే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఒక చాయ్ వాలా ఈ దేశానికి ప్రధాని కావడాన్ని సహించలేకపోతోంది. ఎన్నటికీ నెహ్రూ కుటుంబం నుంచి ఎవరూ మళ్లీ ప్రధాని కాలేరని గ్రహించే ఏదో రకంగా మోదీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని రాంచంద‌ర్‌రావు దుయ్యబట్టారు.

Advertisement
Advertisement