Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్
Government Teachers | బడి గంట మోగక ముందే విద్యార్థులు వస్తారు. కానీ, ఉపాధ్యాయులు (Government Teachers)మాత్రం కనిపించరు. అసలు వస్తారో రారో కూడా తెలియదు. విద్యార్థులకే కాదు.. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కూడా ఎలాంటి సమాచారం ఉండదు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ స్కూళ్లలో (Government Schools) సర్వసాధారణం.
Government Teachers | త్రినేత్ర.న్యూస్: బడి గంట మోగక ముందే విద్యార్థులు వస్తారు. కానీ, ఉపాధ్యాయులు (Government Teachers)మాత్రం కనిపించరు. అసలు వస్తారో రారో కూడా తెలియదు. విద్యార్థులకే కాదు.. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కూడా ఎలాంటి సమాచారం ఉండదు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ స్కూళ్లలో (Government Schools) సర్వసాధారణం. చెప్పాపెట్టకుండా విధులకు గైర్హాజరవుతూ విద్యార్థుల భవిష్యత్‌తో చలగాటమాడే ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్‌పై (Non Teaching Staff) ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇకపై ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా విధులకు ఆబ్సెంట్ అయితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అలాంటివారిపై సీసీఏ (CCA)నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని (Dismiss) రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం వరుసగా ఏడాదికి మించి విధులకు హాజరుకాని (Absent) టీచరు లేదా ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించనున్నారు. నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగికీ వరుసగా ఐదేండ్లకు మించి ఎలాంటి సెలవులను మంజూరు చేయడానికి వీల్లేదు. విదేశీ సర్వీసుల్లో ఉంటూ గడువు ముగిసినా తిరిగి రాని వారికి, ఏడాదికి పైగా అనుమతి లేకుండా విధులకు దూరంగా ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.
అలాంటివారు తమ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా (Resignation) చేసినట్లుగానే భావించి విచారణ పూర్తిచేస్తారు. విధులకు హాజరుకానట్లు గుర్తించిన వెంటనే సదరు ఉద్యోగికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా అనుమతి లేని గైర్హాజరు కాలాన్ని పనిచేయని కాలం (డైస్ నన్)గా పరిగణిస్తారు. ఈ కాలానికి సంబంధించి జీతభత్యాలు చెల్లించకపోవడతంపాటు, ఇంక్రిమెంట్లు, పింఛను వంటి ఆర్థిక ప్రయోజనాల్లో కూడా కోత విధించనున్నారు.
సంబంధిత వార్తలు

DK Shivakumar | రాజీనామా చేస్తే.. క్షణం ఆలోచించకుండా ఆమోదిస్తా.. అసమ్మతి ఎమ్మెల్యేలకు డీకే స్ట్రాంగ్ వార్నింగ్
ఆగస్టు 4, 2026

Ponnam Prabhakar | ఇదొక వ్యక్తి రాజీనామా కాదు.. అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భం
జులై 25, 2026

Breakfast Scheme | ప్రభుత్వ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. ప్రారంభించిన మంత్రి పొన్నం
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు
- ●NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..
- ●గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!
- ●Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!
- ●Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్‌ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
- ●Mumbai Local Train | ముంబై లోకల్ ట్రైన్ అంటే దడదడ.. ఎక్కలేక చేతులెత్తేసిన కొరియన్ టూరిస్ట్

Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు

NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..

గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!

Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!



