Government Teachers | ఆర్ఎస్ఎస్ మార్చ్‌లో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు.. సస్పెండ్ చేసిన సర్కార్
Government Teachers | ఆర్‌ఎస్‌ఎస్ కవాతులో పాల్గొన్న ఇద్దరు ఉపాధ్యాయులపై (Government Teachers) కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూనే నిబంధనలను ఉల్లంఘించి ఆర్‌ఎస్‌ఎస్ పథ సంచలనలో (RSS Patha Sanchalana) పాల్గొన్నందుకుగాను వారిపై వేటు వేసింది.
Government Teachers | త్రినేత్ర.న్యూస్: ఆర్‌ఎస్‌ఎస్ కవాతులో పాల్గొన్న ఇద్దరు ఉపాధ్యాయులపై (Government Teachers) కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూనే నిబంధనలను ఉల్లంఘించి ఆర్‌ఎస్‌ఎస్ పథ సంచలనలో (RSS Patha Sanchalana) పాల్గొన్నందుకుగాను వారిపై వేటు వేసింది.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పథ సంచలనలో యాద్‌గిర్ (Yadgir) జిల్లా హుణసగి బాలికల ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన గురురాజ జోషి (Gururaj Joshi), కుప్పి ప్రభుత్వ జూనియర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అణ్ణాసాహెబ్ దేశ్‌ముఖ్ (Anna Saheb Deshmukh) పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ దుస్తూలు ధరించి కవాతు చేశారు. వారి ఇద్దరిపై అంబేద్కర్ స్వాభిమాని సేన జిల్లా అధ్యక్షుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు వారిద్దరు రూట్ మార్చ్‌లో పాల్గొన్నట్లు తేలింది. ఇది కర్ణాటక సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్ 2021 నిబంధనలకు విరుద్ధమని ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ యాద్‌గిర్ జిల్లా విద్యాశాఖ అధికారి (DDPI) చన్నబసప్ప ఉత్తర్వులు జారీచే శారు.
పంచాయతీ అధికారిపై కూడా..
ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లో పాల్గొన్న మరో అధికారిపై కూడా (Panchayat Officer) ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. గతేడాది అక్టోబర్ 12న రాయచూరు జిల్లా లింగసుగూర్‌లో జరిగిన కవాతులో సిర్వార్ తాలూకా పంచాయతీ అభివృద్ధి అధికారి (PDO) ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ యూనిఫాం ధరించి, కర్ర చేతపట్టుకుని రూట్ మార్చ్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | దేవదుర్గ గనిలో పెద్ద ఎత్తున బంగారం.. వెలికి తీయాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
ఆగస్టు 27, 2026

Dhatura | ఆన్లైన్లో ఉమ్మెత్త పండ్లు, విత్తనాలు.. అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ లైసెన్సులు రద్దు
ఆగస్టు 25, 2026

EFLU | ఇఫ్లూలో విద్యార్థి సంఘాల మధ్య గొడవ.. 14 మంది సస్పెండ్.. ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థుల ధర్నా
ఆగస్టు 21, 2026
తాజావార్తలు
- ●Traffic Restrictions | హైదరాబాద్ మారథాన్.. ఆగస్టు 30న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
- ●SIR | ఇంటి పేరుతో ఎన్యుమరేషన్ ఫారం.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌కి SIR నోటీసులు
- ●Raksha Bandhan | అనుబంధాల పండుగ.. రక్షాబంధన్..! రాఖీ వెనుక.. ఎన్నో కథలు..!
- ●కాంగ్రెస్ డిసిప్లిన్ చక్రం: మంత్రులపై చర్యలు ఎలా తీసుకుంటారు? కొండా సురేఖ ఎపిసోడ్‌తో పూర్తి వివరాలు
- ●Horoscope | ఆగస్టు 28 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఖర్చులు అధికం!
- ●Bhatti Vikramarka | దేవదుర్గ గనిలో పెద్ద ఎత్తున బంగారం.. వెలికి తీయాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం

Traffic Restrictions | హైదరాబాద్ మారథాన్.. ఆగస్టు 30న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

SIR | ఇంటి పేరుతో ఎన్యుమరేషన్ ఫారం.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌కి SIR నోటీసులు

Raksha Bandhan | అనుబంధాల పండుగ.. రక్షాబంధన్..! రాఖీ వెనుక.. ఎన్నో కథలు..!

కాంగ్రెస్ డిసిప్లిన్ చక్రం: మంత్రులపై చర్యలు ఎలా తీసుకుంటారు? కొండా సురేఖ ఎపిసోడ్‌తో పూర్తి వివరాలు



