CM Revanth Reddy | విద్యార్థుల యూనిఫాంలలో కొత్త డిజైన్లు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
CM Revanth Reddy | ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాంలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫాం రంగులతో పాటు డిజైన్లలోనూ వైవిధ్యం తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు యూనిఫాంలు, ఇతర సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
CM Revanth Reddy | ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాంలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫాం రంగులతో పాటు డిజైన్లలోనూ వైవిధ్యం తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు యూనిఫాంలు, ఇతర సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతిగృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులకు ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయినట్లు సీఎంకు వివరించారు. రెండో జతను ఈ నెలాఖరులోగా అందజేస్తామని తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), మోడల్ స్కూళ్ల విద్యార్థులకు ఇప్పటికే రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని విద్యార్థులందరికీ నోట్ పుస్తకాల పంపిణీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ వసతిగృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులు, కార్పెట్లు, బెడ్‌షీట్లు, టవళ్లను కూడా అందించినట్లు వివరించారు. ఈ ఏడాది విద్యార్థులకు పంపిణీ చేసిన యూనిఫాంలు, ఇతర సామగ్రి నాణ్యతపై తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అధికారులు వెల్లడించారు.
వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభమయ్యే రోజునే విద్యార్థుల చేతికి యూనిఫాంలు, ఇతర సామగ్రి చేరేలా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సరఫరా, తయారీ, పంపిణీ ప్రక్రియలను ముందుగానే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అదనంగా మరో 10 శాతం మంది చేరే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన యూనిఫాంలు, ఇతర సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకునేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పీ సుదర్శన్‌రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aadhaar Biometric | అక్టోబర్ 1 నుంచి గ్యాస్ సబ్సిడీకి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి..!
సెప్టెంబర్ 19, 2026

Brahmotsavam | వైభవంగా గరుడ సేవ.. గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
సెప్టెంబర్ 19, 2026

BCCI | టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా కొత్త ముఖం?.. తెరపైకి ఆ మాజీ క్రికెటర్ పేరు..!
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Aadhaar Biometric | అక్టోబర్ 1 నుంచి గ్యాస్ సబ్సిడీకి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి..!
- ●Brahmotsavam | వైభవంగా గరుడ సేవ.. గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
- ●BCCI | టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా కొత్త ముఖం?.. తెరపైకి ఆ మాజీ క్రికెటర్ పేరు..!
- ●Special Trains | పండుగలకు ఊరెళ్తున్నారా..? చర్లపల్లి–నాగర్‌కోయిల్ మధ్య ఐదు ప్రత్యేక రైళ్లు..!
- ●Mrunal Thakur | పూల గౌనులో క్యూట్ ఫొటోలతో కట్టిపడేసిన సీతారామం హీరోయిన్
- ●Deepika Padukone | రెండోసారి తల్లయిన దీపికా పడుకోణ్ - పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్

Aadhaar Biometric | అక్టోబర్ 1 నుంచి గ్యాస్ సబ్సిడీకి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి..!

Brahmotsavam | వైభవంగా గరుడ సేవ.. గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల గిరులు

BCCI | టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా కొత్త ముఖం?.. తెరపైకి ఆ మాజీ క్రికెటర్ పేరు..!

Special Trains | పండుగలకు ఊరెళ్తున్నారా..? చర్లపల్లి–నాగర్‌కోయిల్ మధ్య ఐదు ప్రత్యేక రైళ్లు..!



