త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Satyam Srirangam | జ్ఞానేశ్‌ కుమార్ అక్రమాలపై రేపు రాష్ట్ర‌వ్యాప్త ఆందోళ‌న‌లు

Satyam Srirangam | కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి జ్ఞానేశ్‌ కుమార్ అక్రమాలపై రేపు పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయ‌నున్న‌ట్లు టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం తెలిపారు.

S

Telangana | Published On Sep 26, 2026, 2.49 pm IST

Satyam Srirangam | జ్ఞానేశ్‌ కుమార్ అక్రమాలపై రేపు రాష్ట్ర‌వ్యాప్త ఆందోళ‌న‌లు
Advertisement
  • ఆయ‌న ఈసీని భ్ర‌ష్టు ప‌ట్టించ‌క‌పోతే బీజేపీకి 200 సీట్లు కూడా రాక‌పోయేవి
  • 2024లో అంతా బీజేపీకి వ్య‌తిరేకంగా ఉన్నా గెలిచింది
  • మోదీ, అమిత్ షాకు సిగ్గ‌నిపించ‌ట్లేదా?
  • టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ధ్వ‌జం

Satyam Srirangam | త్రినేత్ర న్యూస్: కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి జ్ఞానేశ్‌ కుమార్ అక్రమాలపై రేపు పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయ‌నున్న‌ట్లు టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం తెలిపారు. జ్ఞానేశ్‌ కుమార్ ఈసీని భ్ర‌ష్టు పట్టించకపోతే బీజేపీకి 200 సీట్లు కూడా రాకపోయేటివన్నారు. దేశంలో అందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ 2024లో ఆ పార్టీ గెలిచింద‌ని చెప్పారు. ఆర్టికల్ 324 ప్ర‌కారం ఎల‌క్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఉండాలన్నారు. మోదీ, అమిత్ షా కు సిగ్గు అనిపించట్లేదా? అని మండిప‌డ్డారు. శ‌నివారం గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఫైర‌య్యారు.

సీఎం రేవంత్ ఆర్యాదాన్ మహ్మద్ అవార్డ్ తీసుకోవడం సంతోషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా స్వామ్య విలువలపై అపార నమ్మకం ఉన్న వ్యక్తి. రేవంత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

SIR ద్వారా దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించారు. ప్రతి పక్ష నేతల ఓట్లు తీసివేశారు. జ్ఞానేశ్వర్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేయాలి. ఆయ‌న‌ను వెంటనే తొలగించి ప్రాసిక్యూట్ చేయాలి. మోదీ, అమిత్ షా పాలనలో ఎల‌క్షన్ కమిషన్ భ్ర‌ష్టు పట్టిపోతుంది. మోదీ, అమిత్ షాలు ఎన్నికల కమిషన్‌ను భ్ర‌ష్టు పట్టించడానికే జ్ఞానేశ్వర్ కుమార్‌ను నియమించారు. రాజ్యాంగం ప్రమాదంలో పడింది. SIR పై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరు కమిషనర్లను బుల్డోజ్ చేసి తప్పుదోవ పట్టించారు.

జెన్‌జీ తోడు కావాలి..

మోదీ, అమిత్ షా వల్ల‌ ఎన్నికల సంఘం భ్ర‌ష్టు పడుతుందని రాహల్ గాంధీ అన్నారు. మోదీ, అమిత్ షా దేశాన్ని ఏమి చేయాలనుకుంటున్నారు? మీ దుర్మార్గమైన చర్యల ద్వారా దేశం అబాసు పాలవుతోంది. మోదీ, అమిత్ షాకు సిగ్గు అనిపించట్లేదా? రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ సంవత్సరం నుంచే ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాడు. జెన్‌జీ యువత రాహుల్ గాంధీకి తోడుగా ఉండాలి. కాంగ్రెస్ మీకు అండగా ఉంది. మోదీ మెడలు వంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. రాహుల్ గాంధీ పోరాటానికి దేశ వ్యాప్తంగా మద్దతు కావాలి అని స‌త్యం శ్రీ‌రంగం విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement