త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ex officio Members | ఎక్స్అఫీషియో ఓట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత

Ex officio Members | తెలంగాణ (Telangana) లో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ఫలితాల్లో చాలా వరకు ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎక్స్అఫీషియో ఓట్లపై స్పష్టతను ఇస్తూ సర్క్యులర్ జారీ చేసింది.

A

Telangana | Published On Feb 14, 2026, 5.05 pm IST

Ex officio Members | ఎక్స్అఫీషియో ఓట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత
Advertisement

Ex officio Members | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ (Telangana) లో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ఫలితాలు విడుదలయ్యాయి. చాలా వరకు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎక్స్అఫీషియో ఓట్లపై స్పష్టతను ఇస్తూ సర్క్యులర్ జారీ చేసింది. భారత రాజ్యాంగం, తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం, 219, రాష్ట్ర హైకోర్టు తీర్పులను ఉటంకిస్తూ పాటించాల్సిన నిబంధనలను పేర్కొంది. ఎమ్మెల్యేలు, లోక్ సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో ఓటు వినియోగించుకోవచ్చు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు తమకు ఓటు హక్కు ఉన్న మున్సిపాలిటీలోనే ఎక్స్అఫీషియో ఓటు వేయాల్సి ఉంటుంది. ఎక్స్అఫీషియో ఓటు నమోదుకు ఎన్నికల సంఘం శనివారం వరకు గడువు విధించింది.

Advertisement
Advertisement