త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

N Ramachander Rao | హిట్ల‌ర్ లాగే రేవంత్ ప్ర‌భుత్వానికి మ‌ర‌ణం త‌ప్ప‌దు : ఎన్ రామ‌చంద‌ర్ రావు

N Ramachander Rao | హిట్ల‌ర్ లాగే రేవంత్ ప్ర‌భుత్వానికి మ‌ర‌ణం త‌ప్ప‌దు అని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్ రావు హెచ్చ‌రించారు. హిట్ల‌ర్ మార్గంలో న‌డిచేవాడు.. హిట్ల‌ర్ లాగే మ‌ర‌ణిస్తాడు అని ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On Jun 8, 2026, 5.12 pm IST

N Ramachander Rao | హిట్ల‌ర్ లాగే రేవంత్ ప్ర‌భుత్వానికి మ‌ర‌ణం త‌ప్ప‌దు : ఎన్ రామ‌చంద‌ర్ రావు
Advertisement

N Ramachander Rao | త్రినేత్ర‌.న్యూస్ : హిట్ల‌ర్ లాగే రేవంత్ ప్ర‌భుత్వానికి మ‌ర‌ణం త‌ప్ప‌దు అని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్ రావు హెచ్చ‌రించారు. హిట్ల‌ర్ మార్గంలో న‌డిచేవాడు.. హిట్ల‌ర్ లాగే మ‌ర‌ణిస్తాడు అని ఆయ‌న పేర్కొన్నారు. నాంప‌ల్లిలోని బీజేపీ కార్యాల‌యంలో రామ‌చంద‌ర్ రావు సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి మ‌ళ్లీ అబ‌ద్ధాలు చెప్పారు.. ముఖ్య‌మంత్రి అని ఆయ‌న మ‌రిచిపోతున్నారు. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు చెప్పాలి. ముఖ్య‌మంత్రి అబ‌ద్ధాలు చెప్ప‌డ‌మ‌నేది ప్ర‌జ‌ల‌ను అవ‌మాన‌ప‌రిచిన‌ట్టే. బీజేపీ దేశ‌మంతా వ్యాపిస్తుంద‌ని చెప్పి.. రేవంత్ రెడ్డి బీజేపీ మీద ద్వేషం, కోపం పెంచుకుంటున్నారు. జీడీపీలో దేశం ముందుకు పోతుంద‌ని ప్ర‌పంచ‌మంతా గుర్తించింది. దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ స‌హించ‌లేక‌పోతుంది. దేశాన్ని ఉత్త‌రాది, ద‌క్షిణాదిగా విభ‌జించే విధంగా రేవంత్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని రామ‌చంద‌ర్ రావు మండిప‌డ్డారు.

కాంగ్రెస్ పార్టీ మ‌న‌స్త‌త్వ‌మే హిట్ల‌ర్ మ‌న‌స్త‌త్వం..

హైడ్రాను హిట్ల‌ర్ నుంచి తీసుకున్నార‌ట‌. హిట్ల‌ర్ ప్ర‌పంచం మొత్తంలో ఒక యుద్ధానికి కార‌ణ‌మైన వ్య‌క్తి. ఆయ‌న చ‌నిపోతే ప్ర‌పంచమంతా సంతోష‌ప‌డ్డారు. ఏ హిట్ల‌ర్ అయితే ప్ర‌పంచాన్ని నాశ‌నం చేశారో.. అలాంటి వ్య‌క్తి నుంచి హైడ్రాను తీసుకున్నార‌ట‌. కాంగ్రెస్ పార్టీ మ‌న‌స్త‌త్వ‌మే హిట్ల‌ర్ మ‌న‌స్త‌త్వం. రాజ్యాంగ సంస్థ‌ల మీద న‌మ్మ‌కం లేదు.. రాజ్యాంగం మీద వారికి అస‌లే న‌మ్మ‌కం లేదు. అందుకే ఎమ‌ర్జెన్సీ విధించారు. ఎమ‌ర్జెన్సీ విధించ‌డ‌మే హిట్ల‌ర్ మెంటాల్టీ. ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీ ఉంది. మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ఏఐసీసీ చీఫ్ అయ్యాక కూడా.. రాహుల్, ప్రియాంక గాంధీనే పార్టీని న‌డుపుతున్నారు.. వారికి రేవంత్ రెడ్డి గులాంగిరి చేస్తున్నారని బీజేపీ చీఫ్ ధ్వ‌జ‌మెత్తారు.

మ‌రి ఇటాలియ‌న్ గురువుల కాళ్లు మొక్క‌డం లేదా..?

నేను ప్ర‌ధాని మోదీ, రాష్ట్ర‌ప‌తి ముర్ము కాళ్లు మొక్కాల్నా, వారికి సెల్యూట్ చేయాల్నా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మ‌రి ఇటాలియ‌న్ గురువుల కాళ్లు మొక్క‌డం లేదా..? భార‌తీయుల కాళ్లు మొక్కితే త‌ప్పేంటి..?నువ్వు మోదీ, రాష్ట్ర‌ప‌తిని అవ‌మాన‌ప‌రిచిన‌ట్టు కాదా..? కేవ‌లం ఇటాలియ‌న్ కుటుంబానికి స‌లాం కొట్ట‌డ‌మే నీ ఆలోచ‌న‌, వారికి బ్యాగులు మోయ‌డ‌మే నీ ప‌ని.. ఇటాలియ‌న్ గురువుల‌కు కాళ్ల‌కు మొక్కుతున్న‌వ్.. భార‌తీయుల‌కు కాళ్ల‌కు మొక్కితే త‌ప్పేంటి..? మోదీకి, ముర్ముకు న‌మ‌స్తే పెడితే బాధ‌ప‌డుతున్నావా.. మ‌హిళ‌న అవ‌మాన‌ప‌రిచిన‌ట్టు క‌దా..? కేవ‌లం ఇటాలియ‌న్ కుటుంబానికి స‌లాం కొట్ట‌డ‌మే నీ ఆలోచ‌న అని రేవంత్‌పై రామ‌చంద‌ర్ రావు నిప్పులు చెరిగారు.

Advertisement
Advertisement